amp pages | Sakshi

చీటూరులో మరో యువకుడి ఆత్మహత్యాయత్నం

Published on Fri, 07/27/2018 - 12:21

లింగాలఘణపురం జనగామ : మండలంలోని చీటూరులో మరో యువకుడు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అప్రమత్తమై మందు డబ్బాను లాక్కొని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇప్పటికే చీటూరులో నాలుగేళ్లలో పది మంది యువకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా యుక్త వయసులోనే మద్యానికి బానిసలవడం, చిన్న విషయాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఒకరిని చూసి మరొకరు ఆత్మహత్యలకు పాల్పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువతలో మనో ధైర్యం కల్పించే విధంగా కౌన్సెలింగ్‌ నిర్వహిం చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే పది మంది యువకులు ఆత్మహత్య చేసుకోవడం, ఒకరిద్దరు యువకులు కూడా తాము చనిపోతామం టూ తల్లిదండ్రులకు చెబుతుండడం గమనార్హం.

చావుతో ఏదీ పరిష్కారం కాదు

యువకులు ఆత్మహత్యలకు పాల్పడితే సమస్యలు పరిష్కా రం కావు. సమస్యలు ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. యుక్తవయసులో చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై దష్టి సారించాలి. 

–పసుల సోమనర్సయ్య, మాజీ ఎంపీపీ, చీటూరు

యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి

గ్రామంలోని యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. ఇప్పటికే నాలుగేళ్లలో పది మందికి పైగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌన్సెలింగ్‌తో యువకుల్లో మనోధైర్యం కల్పించాలి. ఎంతో భవిష్యత్‌ ఉన్న యుక్త వయసు వారే చనిపోవడం గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది.

– ఉప్పల మధు, ఎంపీటీసీ సభ్యుడు, చీటూరు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)