amp pages | Sakshi

‘వసూల్‌రాజా’లపై ఏసీబీ నజర్‌

Published on Sun, 06/10/2018 - 02:59

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖలో వసూల్‌రాజాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. ఇటీవల బయటపడిన వసూళ్లు, దందాల చిట్టాకు సంబంధించి ఇప్పటికే వివరాలు  సేకరించిన ఏసీబీ.. ఆ వసూల్‌రాజాల లెక్క తేల్చేందుకు వేగం పెంచింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా     గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో అవినీతి ఖాకీలపై కేసుల నమోదుకు రంగం సిద్ధం చేసింది.  

ముందుగా ఆ అధికారులపై..
రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇసుక దందాలు నడిచే ప్రాంతాల్లోకి రూ.లక్షలు ఖర్చు పెట్టి పోస్టింగులు పొందిన అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. ఇంటెలిజెన్స్‌ విభాగం రూపొందించిన నివేదికలో వారి వివరాలు పూసగుచ్చినట్లు వివరించడంతో ముందుగా వారిపై కేసులు నమోదు చేయాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం.

వీరిలో నలుగురు డీఎస్పీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్ల జాబితాను సీఐయూ (సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌)కు పంపినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల ఆస్తులు, వారి భార్యాపిల్లలు, బంధువుల పేర్లపై కొనుగోలు చేసిన ఆస్తిపత్రాలు సేకరిస్తున్నట్లు సమాచారం. జీతభత్యాలు, సేవింగ్స్, ఇతర ఆర్థిక వ్యవహారాలను సరిపోల్చుకున్న తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు తెలిసింది.  

దూకుడు పెంచుతున్న ఏసీబీ
రాష్ట్ర స్థాయి హోదాలో పని చేస్తున్న పోలీసు అధికారులపై దాడులు చేయా లంటే సాధారణ పరిపాలన విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. దీంతో సంబంధిత అధికారులు రాజకీయ∙ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి దాడులకు అనుమతివ్వకుండా అడ్డుకున్న సందర్భాలు గతంలో ఎన్నో వెలుగుచుశాయి.

కానీ ఈసారి మాత్రం పూర్తిస్థాయి ఆధారాలతో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గ్రీన్‌సిగ్నల్‌ పొందినట్లు తెలిసింది. మామూళ్ల చిట్టా బయటపడిన తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో తమ విభాగంపై నమ్మకం సడలుతుందని ఏసీబీలోని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అందుకే ఈ సారి పూర్తి స్థాయి ఆధారాలతో అవినీతి అధికారులపై కేసులు నమోదు చేయనున్నామని ఆయన చెప్పారు.

దందాలపై పోలీసు శాఖ ఆగ్రహం
ప్రభుత్వమే అన్ని రకాల మెయింటెనెన్స్‌ ఖర్చులిస్తున్నా కింది స్థాయి సిబ్బందితో ఇలాంటి దందాలు సాగించడంపై పోలీసు శాఖ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసు శాఖలో అవినీతిని క్రమక్రమంగా నియంత్రించడంలో భాగంగానే అక్రమార్కుల జాబితా తయారు చేసినట్లు సీనియర్‌ ఐపీఎస్‌లు అభిప్రాయపడ్డారు. కాగా, మామూళ్ల చిట్టాలో బయటపడిన కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, హోంగార్డులనే పోలీస్‌ శాఖ బలిచేసిందన్న ఆరోపణ వినిపిస్తున్న తరుణంలో పెద్ద అధికారులపై చర్యలకు ఏసీబీ వేగం పెంచింది.


స్పౌజ్‌ పాయింట్లు పరిగణించాలి: ఎస్టీయూ
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో స్పౌజ్‌ పాయింట్ల కింద ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద గౌడ్‌ శనివారం  డిమాండ్‌ చేశారు. బదిలీ దరఖాస్తు గడువును 3 రోజులు పెంచి టీచర్లకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)