amp pages | Sakshi

రెవెన్యూలో భయం.. భయం! 

Published on Tue, 11/05/2019 - 03:49

సాక్షి, హైదరాబాద్‌: పట్టపగలే ఓ మహిళాధికారి దారుణహత్యకు గురికావడం రాష్ట్ర ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. తహసీల్దార్‌ విజయారెడ్డిని ఆమె పనిచేస్తున్న చోటే సజీవదహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమేదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆందోళనకు గురైంది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత ఆందోళనకు లోనైంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చినా.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కింద నిజామాబాద్‌ తహసీల్దార్‌ జ్వాలాగిరిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉద్యోగవర్గాలను కలవరపరిచింది. ఈ ఘటన మరువక ముందే ఇప్పు డు మహిళా తహసీల్దార్‌ను ఏకంగా హత్య చేయడం రెవెన్యూ వర్గాలను కలవరపరుస్తోంది.  

ఎవరికీ తెలియలేదు.. 
మండలాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కార్యాలయంలో విధి నిర్వహణలో తలమునకలైన ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ స్థాయి అధికారిపై సులువుగా దాడి జరగడానికి భద్రతా లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్‌ గదికి రానుపోను ఒకే ద్వారం ఉండడం, మిగతా సిబ్బంది గదులకు దూరంగా, వేరుగా ఉండటంతో తహసీల్దార్‌ రూమ్‌లో ఎవరున్నారనేది కూడా గమనించలేని పరిస్థితి ఉంది. సోమవారం తహసీల్దార్‌ ఉండే గది లోపలికి నిందితుడు వెళ్లి గడియ వేసుకున్నా.. ఆమెతో వాగి్వవాదానికి దిగినా.. ఆఖరికిపై ఆమెపై పెట్రోల్‌ పోసి తగలబెట్టినా వెలుపల హాల్‌లో పనిచేసేవారికి తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి విజయారెడ్డికి నిప్పంటించే క్రమంలో కాలిన గాయాలతో భరించలేక నిందితుడు గడియ తీసుకొని బయటకు పరుగులు తీస్తే కానీ, లోపలేం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. ప్రైవేటు సెక్యూరిటీని కూడా నియమించుకోకపోవడం.. తహసీల్దార్‌ను కలిసిన సమయంలో అక్కడే ఉండాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఘటనకు ఊతమిచ్చింది.  

రికార్డుల నవీకరణతో సతమతం.. 
భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు రెవెన్యూ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రికార్డుల నవీకరణ అనంతరం రెవెన్యూ ఉద్యోగులపై పనిభారమే కాకుండా ఒత్తిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా చాలాచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులకు, రికార్డులకు పొంతన కుదరకపోవడంతో వివాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక సమస్యలు, కౌలుదారులు, పట్టాదారులు, సోదరులు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములుగా తేలిన వంటి వాటికి పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టడంతో రెవెన్యూ ఉద్యోగులే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. కబ్జా కాలమ్‌ను ప్రభుత్వం తొలగించడం రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయపరమైన వివాదాలపై అర్జీదారులను సముదాయించినా.. సమాధానం చెప్పినా.. శాంతించకపోవడంతో రెవెన్యూ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ధరణి సాఫ్ట్‌వేర్‌ లోపాలూ వీరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం 
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజాయారెడ్డి హత్యపై ప్రభుత్వం విచారణకుఆదేశించింది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)