amp pages | Sakshi

రికార్డు బ్రేక్

Published on Wed, 10/01/2014 - 03:12

భద్రాచలం :  భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన రికార్డు నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ నెలలో 356 ప్రసవాలు జరిగాయి. భద్రాచలం ఏరియా ఆసుపత్రి నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒకే నెలలో ఈ స్థాయిలో ప్రసవాలు జరగటం ఇదే ప్రథమం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవీ కోటిరెడ్డికి ఈ ఘనత దక్కినట్లైంది. కాగా కోటిరెడ్డి సూపరింటెండెంగ్‌గా పనిచేసిన కాలంలోనే గతంలో ఒకే నెలలో 350 ప్రసవాలు జరగగా, అప్పట్లో అది రికార్డుగా నమోదైంది. తిరిగి తన రికార్డును తన హయాంలోనే అధిగమించటం గమనార్హం.

 వంద పడకలున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి జిల్లాలోని ఏజెన్సీ మండలాల నుంచే కాకుండా పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా వైద్యం కోసం వస్తుంటారు. ఎక్కువగా గిరిజనులే ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులను మినహాయిస్తే, ఈ స్థాయిలో డెలివరీలు నమోదైంది మరెక్కడా లేదు. మంగళవారంతో సెప్టెంబర్ నెల ముగియగా, మరో రెండుమూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఆసుపత్రుల నుంచి జనన, మరణాల నివేదికలు వచ్చే అవకాశం ఉంది.

 ఇలా నివేదికలు వచ్చిన తరువాత భద్రాచలం ఏరియా ఆసుపత్రి డెలవరీల రికార్డును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏజెన్సీకి ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఈ స్థాయిలో ప్రసవాలు జరగడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఇక్కడి వైద్యులను  అభినందించారు. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డిని సాక్షి పలుకరించగా, ఇంత ఎక్కువగా ప్రసవాలు చేయటంలో డాక్టర్ పుల్లయ్య, గైనకాలజిస్టు విప్లవ కృషి ఎంతో ఉందన్నారు.

డాక్టర్ పుల్లయ్య అదనపు డీఎంహెచ్‌వోగా ఏజెన్సీ ఆసుపత్రులను పర్యవేక్షిస్తూనే ఏరియా ఆసుపత్రి పరిస్థితి దృష్ట్యా ప్రసవాలను చేసేందుకు రావటం ద్వారానే అరుదైన రికార్డు లభించిందని, ఇది వారిద్దరికే దక్కుతుందని అన్నారు. అలాగే సిబ్బంది కృషి కూడా ఉందని, బుధవారం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందికి అభినందన సభ ఏర్పాటు చేశామని చెప్పారు.

 ఇక్కడే ఉంటారా..?
 సూపరింటెండెంట్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కోటిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయినందున కీలకమైన పోస్టులో ఉండేందుకు వీల్లేదని, కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికి నియమించేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. నేడో, రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న అధికారిని కొనసాగించేలా జిల్లా ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)