amp pages | Sakshi

జీవాలపైకి దూసుకెళ్లిన లారీ

Published on Wed, 07/18/2018 - 13:03

బిజినేపల్లి రూరల్‌(నాగర్‌కర్నూల్‌) :  రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలను ఓ లారీ నలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని పాలెం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు... మంగనూర్‌ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శివయ్య, మాసయ్య, శ్రీను, పర్వతాలుకు ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలను అందజేసింది. స్థానికంగా మేత లేకపోవడంతో నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకోవాలని నలుగురు గ్రామం నుంచి సోమవారం బయల్దేరారు.

మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో పాలెం సమీపంలో వెళ్తుండగా, ఓ లారీ మందపైకి దూసుకొచ్చింది. దీంతో మందలోని 29 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటనపై కాపరుల ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు కావడంతో పశువైద్యాధికారులు అక్కడికి చేరుకుని, వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కాపరులు వేడుకున్నారు. గొర్రెల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.   

కాపరులను పరామర్శించిన ఎమ్మెల్యే  

విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాపరులకు రూ.15వేల ఆర్థిక సాయం అంది ంచా రు. ప్రభుత్వం నుంచి బీమా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌.శ్రీను సంఘటనా స్థలంలో గొర్రెల కాపరులతో మాట్లాడారు.

కాపరులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ రాములు, పశువైద్య అధికారి బుచ్చమ్మ, ఎంపీటీసీ మనోహర్, మాజీ ఎంపీపీ బాలీశ్వర్, జాలం నాగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కిరణ్, బాలస్వామి, ఎల్లస్వామి, తిరుమల్‌యాదవ్, జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)