amp pages | Sakshi

వార్దా తుపాను : సముద్రం అల్లకల్లోలం

Published on Sun, 12/11/2016 - 16:51

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న 'వార్దా' తుపాను పెను తుపానుగా మారింది.చెన్నైకి 330 కి.మీ, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 390 కి.మీ.ల దూరంలో వార్దా కేంద్రీకృతమైందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ శేషగిరిబాబు చెప్పారు. ఆదివారం రాత్రి నుంచి క్రమేణా తుపాను బలహీనపడనుంది. సోమవారం మధ్యాహ్నానికి చెన్నై-పులికాట్ సరస్సు మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు.

దక్షిణ కోస్తాలో తీరం దాటే సమయంలో గంటకు 50-60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. దీని ప్రభావంతో తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. విజయవాడలోని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి వార్దా తుపాను తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లాలో భారీగా సముద్రం ముందుకు వచ్చింది. కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నెంబర్, మిగతా పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద  జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.