amp pages | Sakshi

అమెరికాకు తలైవా

Published on Fri, 04/20/2018 - 07:06

రాజకీయాల్లోకి వచ్చేశా..! అంటూ గత ఏడాది చివరి రోజునదక్షిణభారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ తనఅభిమానులకు సంకేతాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. సొంత పార్టీతో ప్రజల్లోకి వెళ్దామని ఆయన ప్రకటించి నాలుగు నెలలుకావస్తోంది. ఈ కాలంలో అభిమాన సంఘాల్ని ఏకంచేసే పనిలో రజనీ నిమగ్నం అయ్యారు. రజనీ మక్కల్‌ మండ్రంను ప్రకటించి, కార్యవర్గాల ఎంపిక మీద దృష్టి పెట్టారు. జిల్లాల వారీగాకార్యవర్గాల ఎంపిక ముగింపు దశకు చేరింది. మక్కల్‌ మండ్రం శాఖలను రాష్ట్రంలో 65 వేలుగా ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు కోటి లక్ష్యంగా రజనీకాంత్‌ నిర్ణయించారు. మక్కల్‌ మండ్రం మీదే పూర్తిస్థాయిలో దృష్టి సాగుతున్నా, పార్టీ  ఎప్పుడెప్పుడెప్పుడా అన్నది మాత్రం దాటవేత ధోరణితో ముందుకుసాగుతోంది.

తమిళ కొత్త సంవత్సరాది వేళ పార్టీ ప్రకటన చేయవచ్చన్న ప్రచారం తొలుత సాగింది. అయితే, ఆ రోజున రజనీ ఎలాంటి ప్రకటన చేయకపోగా, అసలు స్పందించనే లేదు. రాజకీయ పార్టీ కసరత్తులుసాగుతూనే ఉన్నాయని పదే పదేచెప్పుకుంటున్నా, ప్రకటన కోసం వేచి చూడాల్సిందేనని నాన్చుడు ధోరణిలో పడ్డారు. అదే సమయంలో ప్రజలసమస్యలపై స్పందిస్తూ, కావేరివ్యవహారంపై ప్రకటనలే కాదు, స్వయంగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చుతూ వచ్చిన రజనీ కాంత్‌ మరి కొద్దిరోజుల్లో అమెరికా పయనానికి సిద్ధం అవుతుండడం గమనార్హం.

సాక్షి, చెన్నై : త్వరలో తలైవా రజనీకాంత్‌ అమెరికా పయనం కానున్నారు. వారం రోజులకుపైగా అక్కడే ఆయన ఉంటారు. ఈ పర్యటన ఏర్పాట్ల సమాచారంతో ఇప్పట్లో రజనీ పార్టీ ప్రకటన అనుమానంగా మారింది.గత నెల రజనీ కాంత్‌ ఆధ్యాత్మిక పయనాన్ని సాగించారు. రిషికేష్, ఉత్తరాఖండ్, బాబా ఆశ్రమాల సందర్శనకు ఆయన వెళ్లడం, అక్కడి నుంచి రాగానే రాజకీయ ప్రకటన తథ్యమని ప్రచారం సాగింది. అయితే, తలైవా పార్టీ విషయంగా నోరు మెదపలేదు. ఈ పరిస్థితుల్లో మరి కొద్ది రోజుల్లో రజనీ అమెరికా పయనం కాబోతున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లలో సన్నిహితులు ఉన్నారు. వారం రోజులకు పైగా ఆయన అక్కడే ఉంటారని సమాచారం.

రజనీ అమెరికా పర్యటనతో ఇప్పట్లో పార్టీ ప్రకటన అనేది అనుమానమే అని తెలుస్తోంది. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం ఈ పర్యటన ముందుగా నిర్ణయించినదేనని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు రజనీ వెళ్తున్నట్టు, ఆయన పర్యటనకు వెళ్లినా, పార్టీ ఏర్పాటు కసరత్తులు, ఇతర వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు తగ్గ ఏర్పాట్లు చేసే వెళ్తారని స్పందిస్తున్నారు. తలైవా అమెరికా పర్యటన ఎప్పుడు అన్నది అధికారికంగా ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు.  కాగా, సినిమా వివాద సమస్య సమసిపోవడంతో మరో నెల రోజుల్లో ‘కాల’ విడుదల, ఆ తదుపరి రోబో విడుదల మీద రజనీ దృష్టి పెట్టబోతున్నారు. ఆ తదుపరి మరో కొత్త సినిమా మీద పూర్తిగా లీనం కానున్న నేపథ్యంలో, ఇక రాజకీయ పార్టీ అన్నది ఈ ఏడాది కూడా లేన్నట్టే అన్న చర్చ ఊపందుకుంది.

రజనీతో ఆనంద రాజ్‌ భేటీ
అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన అనంతరం సినీ నటుడు ఆనంద రాజ్‌ పార్టీలకు దూరంగా ఉన్నారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వైపు ఆయన చూపు మరళినా, చివరకు వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన పోయెస్‌ గార్డెన్‌లోని రజనీ కాంత్‌ ఇంటి మెట్లెక్కడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రజనీని పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం. తమిళ ప్రజల మీద రజనీకి చిత్తశుద్ధి ఉందని, వారికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన అడుగులు సాగుతున్నాయని కితాబు ఇచ్చారు. ప్రజా జీవితంలోకి పూర్తిస్థాయిలో తనను ఆయన త్వరగా అంకితం చేసుకుంటారన్నారు. అయితే, రజనీకి వ్యతిరేకంగా భారతీరాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆనంద రాజ్‌ పేర్కొన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)