amp pages | Sakshi

కోర్టుకు హక్కులేదు

Published on Fri, 04/24/2015 - 01:27

విద్యుత్ బోర్డు నియంత్రణ కమిషన్ వ్యాఖ్య
 అక్రమాలు సాగుతున్నాయన్న పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:విద్యుత్ బోర్డు పరిధిలో ఉన్న వినియోగం సరఫరా హక్కును హరించే అధికారం న్యాయస్థానానికి లేదని తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్ మద్రాసు హైకోర్టులో స్పష్టం చేసింది. విద్యుత్ కోనుగోళ్లలో విరివిగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెన్నై ఉల్లరత్తకు చెందిన సి శెల్వరాజ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదించారు. పిటిషనర్‌దారు దాఖలు చేసిన వ్యాజ్యంలోని వివరాలు ఇలా ఉన్నాయి. 2003లో పార్లమెంటులో కొత్త విద్యుత్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం కింద తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా బోర్డు ఏర్పాటై ఆయా పనులను నిర్వహిస్తున్నాయి.
 
  ఆ తరువాత ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే విద్యుత్ ఉత్పత్తి సంస్థలను మూసివేసి, నిషేధం విధించారు. ప్రయివేటు విద్యుత్ సంస్థలకు అనుమతులు మంజూరు చేసి హెచ్చుధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక యూనిట్‌ను రూ.3 ఖర్చుతో ఉత్పత్తి చేసే అవకాశం ఉండగా రూ.15  చెల్లించి ప్రయివేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒక యూనిట్‌కు రూ.12 అదనపు భారం పడుతుండగా, ఇదే అదనుగా ప్రభుత్వాధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. విద్యుత్ కొనుగోలులో చోటుచేసుకున్న అక్రమాల వల్ల ప్రభుత్వానికి గత కొన్నేళ్లలో రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. విద్యుత్ కొనుగోలులో దోపిడీపై ప్రత్యేక విచారణకు ఆదేశించాలని వాజ్యంలో కోర్టును కోరారు. ఈ పిల్‌పై విద్యుత్ కమిషన్ స్పందిస్తూ నిజాయితీ అధికారులపై ఉద్దేశ్యపూర్వకంగా అపనిందలు వేశారని గతంలో కోర్టుకు బదులిచ్చింది.
 
  ఈ వ్యాజ్యం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి శివజ్ఞానం ముందుకు రాగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సోమయాజీ, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అబ్దుల్ సలీమ్ కోర్టుకు హాజరై పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు అర్హతలేని ఈ వ్యాజ్యాన్ని ఆరంభంలోనే కొట్టివేయాలని అన్నారు. పిటిషన్‌దారుడు విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు ముందుగా ఫిర్యాదు చేయకుండా నేరుగా కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశాడని తెలిపారు. విద్యుత్ కమిషన్, విద్యుత్ బోర్డును రద్దుచేసే అధికారం విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు మాత్రమే ఉంది, కోర్టుకు లేదని వారు తమ వాదనలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 2.5 కోట్ల ప్రజానీకానికి కమిషన్ ద్వారానే విద్యుత్ సరఫరా సాగుతోందని చెప్పారు.
 
  విద్యుత్ కొనుగోలు, సరఫరా, చార్జీల నిర్ణయం అంతా విద్యుత్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని చెప్పారు. కమిషన్ ఏర్పడిన తరువాతనే విద్యుత్ బోర్డు లాభాల బాట పట్టిందని వివరించారు. దుర్బుద్దితో వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని న్యాయవాదులు కోరగా, జూలై 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ప్రయివేటు విద్యుత్ కొనుగోలులో అక్రమాల ఆరోపణలపై  మద్రాసు హైకోర్టులో విచారణ సాగుతున్న దశలో తూత్తుకూడి జిల్లా ఉడన్‌కుడి విద్యుత్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ కొనుగోలు టెండర్ల నిబంధనల్లో తాజాగా మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం.
 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)