amp pages | Sakshi

అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం

Published on Mon, 06/19/2017 - 11:25

► మాజీ సీఎం  కుమారస్వామి
మండ్య(కర్నాటక): వచ్చే ఎన్నికల్లో తాము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, జాతీయ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తామని మాజీ సీఎం హెచ్‌.డి.కుమార స్వామి అన్నారు. ఆదివారం మండ్య తాలూకాలోని బసరాలు గ్రామంలో తాయమ్మ, రామేగౌడ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరిహారం, వికలాంగులకు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న కుమార మీడియాతో మాట్లాడుతూ...జేడీఎస్‌ పార్టీ కాంగ్రెస్‌కు గులాంగిరి చేయడం లేదని, వారు చెప్పినట్లు చేయడానికి జేడీఎస్‌ కార్యకర్తలు ఒప్పుకోరని, పార్టీలో ఎవరు కూడా వేలిముద్రలు వేసే వారు లేరని కుమార అన్నారు.

శాసన మండలి సభాపతిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంకు జేడీఎస్‌ పార్టీ మండలి సభ్యులు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారు. దీంతో తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అన్నిటికి సీఎం చెప్పినట్లు చేయడానికి తాము వేలి ముద్రగాళ్లు కాదని కుమార ఎద్దేవా చేశారు. మూడేళ్ల క్రితమే బీజేపీ–జేడీఎస్‌ల మధ్య మద్దతు ఒప్పందం ఉందని, మరో రెండేళ్లు పాటు దీనిని కొనసాగిస్తామన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తాము పోటీ చేస్తామని, ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధులు కేటాయించకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో త్వరలో పార్టీ సమావేశం నిర్వహించి అభ్యర్థిని ప్రకటిస్తామని కుమార స్వామి అన్నారు. 

Videos

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?