amp pages | Sakshi

నాకు మార్చిలో పెళ్లా?

Published on Thu, 11/20/2014 - 02:28

నటి త్రిషకు పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ప్రము ఖ పారిశ్రామికవేత్త, నిర్మాత వరుణ్ మణియన్. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి. ఇది సోమవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ చేస్తున్న ప్రచారం. నిజం చెప్పాలంటే గత ఏడాదికి పైగా త్రిష వివాహం గురించి మీడియాలో రకరకాల ప్రచారం కలకలం రేగుతూనే ఉంది. టాలీవుడ్ నటుడు రానాతో ప్రేమ, రహస్య వివాహం జరిగిపోయిందంటూ వదంతులు జోరుగా సాగాయి. ఇటీవల రానాకు త్రిషకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనికి కారణం ఒక కన్నడ నటి అనే ప్రచారం కూడా హల్‌చల్ చేసింది. ప్రేమ విఫలం అవడంతో నటి త్రిష అసహనంతో ఉన్నారని,  దీంతో అనారోగ్యానికి గురయ్యూరంటూ వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి రకరకాల ప్రచారం మధ్య సోమవారం త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహ నిశ్చితార్థం జరిగిందనే న్యూస్ కోలీవుడ్‌లో మరింత చర్చనీయాంశంగా మారింది. లేసా లేసా చిత్రం ద్వారా హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసిన త్రిష ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రముఖ కథానాయికి స్థాయికి చేరారు. నాయికిగా దశాబ్ద కాలాన్ని దాటేసిన త్రిషకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి ఆమె తల్లి వచ్చారని, వరుడివేటలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా త్రిష వరుణ్ మణియన్ సన్నిహితంగా ఉన్న ఫొటో ఇంటర్‌నెట్‌లో ప్రచారమై కోలీవుడ్‌నే ఆశ్చర్యపరిచింది.

వీరి వివాహ నిశ్చితార్థం రెండు రోజుల ముందు జరిగిందని వచ్చే ఏడాది మార్చిలో త్రిష, వరుణ్ మణియన్‌ల వివాహం జరగనుందని ప్రచారం జోరందుకుంది. అరుుతే ఇదంతా అసత్యప్రచారం అని త్రిష తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాంటిదేమైనా జరిగితే ముందుగా మీకే చెబుతానని ఈ బ్యూటీ అభిమానులనుద్దేశించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అదే విధంగా త్రిష తల్లి ఉమ కూడా నిశ్చితార్థం ప్రచారాన్ని ఖండించారు. త్రిష పెళ్లి ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రచారం గురించి వరుణ్ మణియన్ గానీ, ఆయన కుటుంబం గానీ ఖండించకపోవడం గమనార్హం.పరిశ్రమలోని ఒక వర్గం టాక్ మరోలా వినిపిస్తోంది. నటి త్రిష వరుణ్ మణియన్‌ల నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమేనని ఈ విషయాన్ని త్రిష, ఆమె తల్లి ఉమ దాచడానికి కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే త్రిష ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారని పెళ్లి విషయం తెలిస్తే ఆ చిత్రాల వ్యాపారానికి పెద్ద దెబ్బే తగులుతుందని అందువలన ఈ పెళ్లి నిశ్చితార్థం విషయాన్ని మరికొద్ది రోజులు రహస్యంగా ఉంచాలనే భావనలో వున్నట్లు కోడంబాక్కం టాక్.            - తమిళ సినిమా
 
 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)