amp pages | Sakshi

’రాంజాస్‌’ ఘర్షణలపై కమిటీ ఏర్పాటు

Published on Mon, 02/27/2017 - 12:49

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్‌ కళాశాలలో జరిగిన ఘర్షణలపై విచారణకు కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ విద్యార్థుల పాత్రపై విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా రాంజాస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ సంయమనం పాటించాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని రాజేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విద్యార్థులకు లేఖ రాశారు.  కాగా రాంజాస్‌ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడిన విషయం తెలిసిందే. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే....దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలిద్‌ను రాజాంస్‌ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో వివాదం రాజుకుంది. ఉమర్‌ ఖలీద్‌ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్‌ ఖలీద్‌, షెహ్లా రషీద్‌ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది.

అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్‌, డీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఐఎస్‌ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రాంజాస్‌ కళాశాలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కళాశాలలో జరిగిన ఘర్షణలపై కమిటీ ఏర్పాటు అయింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌