amp pages | Sakshi

నీటి సమస్యకు సింగపూర్ మంత్రం

Published on Tue, 03/31/2015 - 03:47

 న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజల నీటి కష్టాలను తీర్చడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వృథా నీటిని తిరిగి వాడుకునే విధానం అవలంభిస్తున్న సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకోనుంది. వృథా నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే పద్ధతులను అధ్యయన ం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి  కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడతూ వృథా నీటిని తిరిగి ఉపయోగించడంలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి కొన్ని బృందాలను పంపినట్టు తెలిపారు. ‘సింగపూర్‌కు స్వతహాగా నీటి వసతి లేదు. ఆ దేశానికి 95 శాతం నీరు బయటి నుంచే వస్తుంది.
 
  ఆ నీటిని శుద్ధి చేసి తిరిగి ఉపయోగించే నూతన పద్ధతులకు సింగపూర్ శ్రీకారం చుట్టింది. దీని వల్ల బాత్‌రూం, వంటగదిలో ఉపయోగించే నీరు తిరిగి అక్కడే ఉపయోగించొచ్చు. ఈ విధంగా ఎక్కడ వాడుకున్న నీటిని అక్కడే వినియోగించేలా సింగపూర్ పద్ధతిని పరిశీలిస్తున్నాం. దీనిని పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని ఢిల్లీలో 10 నుంచి 15 ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ పద్ధతిలో వ్యర్థ నీటిని శుద్ధి చేసిన ప్పుడు అది పూర్తిగా మంచి నీటిలాగే మారుతుంది. మా ప్రయత్నాలు ఫలిస్తే ఢిల్లీలో నీటి సమస్య అసలు ఉండదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో ఇప్పటికీ కేవలం 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు.  ఆస్తి పన్ను చెల్లింపులను రాబట్టడం గురించి కూడా యోచిస్తున్నామన్నారు.
 

Videos

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)