amp pages | Sakshi

షోలాపూర్‌లో తెలుగు హవా

Published on Sat, 02/25/2017 - 04:02

- తెలంగాణకు చెందిన 22 మంది కార్పొరేటర్లుగా గెలుపు
- వీరిలో 12 మంది మహిళలే.. మరోసారి గెలిచిన రాగిణి


సాక్షి ముంబై:
షోలాపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తెలంగాణ ప్రజలు తమ సత్తాను చాటుకున్నారు. సుమారు 40 శాతానికిపైగా తెలంగాణ ప్రజలున్న షోలాపూర్‌లో 22 మంది తెలుగు అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. వీరిలో 12 మంది మహిళలే ఉండడం విశేషం. అదే విధంగా గెలిచిన అభ్యర్థులలో అత్యధికంగా కరీంనగర్‌ (పాత) జిల్లా వాసులున్నారు. అంతేకాకుండా బీజేపీ నుంచి ఎక్కువ మంది గెలుపొందారు. మూడు శతాబ్దాల కిందటే మహారాష్ట్రకు వలసవచ్చిన తెలంగాణ ప్రజలు షోలాపూర్‌తోపాటు ముంబై, భివండీ, ఠానే, అహ్మద్‌నగర్, పుణే తదితర జిల్లాల్లో స్థిరపడ్డ సంగతి తెలిసిందే.

అయితే షోలాపూర్‌లో మాత్రం అనేక మంది అన్ని రంగాల్లో ఎదిగారు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా గత అనేక సంవత్సరాలుగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు షోలాపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు ఎమ్మెల్యేలుగా కూడా తెలుగు ప్రజలు రాణించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి కూడా కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగు ప్రజలకు అన్ని పార్టీలు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో బీజేపీ నుంచి అత్యధికంగా 11 మంది గెలుపొందగా శివసేన నుంచి ఎనిమిది మంది, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒక అభ్యర్థి గెలుపొందారు. కాగా, మునుపటితో పోలిస్తే ఈసారి కార్పొరేటర్ల సంఖ్య కొంత తగ్గింది.

షోలాపూర్‌లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు..
బీజేపీ: పోసా రాధిక, బిర్కు రామేశ్వరి, గడ్డం విజయలక్ష్మి, వల్యాల్‌ నాగేష్, బోమడ్యాల్‌ అవినాష్, బత్తుల శశికళ, రికమల్లే శ్రీనివాస్, మదుగుల ప్రతిభా, యన్నం కాంచన, కొండి అనితా, పురుడు వరలక్ష్మి.
శివసేన: కోటె దేవేంద్ర, కోటె ప్రథమేష్, సోమల్‌ సావత్రి, గుర్రం మీరా, కోటా విఠల్, అంకారం కుముద్, కోటే మహేష్, కొండ్యాల్‌ వినాయక్‌.
కాంగ్రెస్‌: పుళారే శ్రీదేవి, కరుగులే వైష్ణవి.
సీపీఎం: ఆడం కామిని.

ఠానేలో ఆమె మరోసారి..
ఠానే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూడా ఈ సారి బైరిశెట్టి రాగిణి విజయం సాధించారు. హైదరాబాద్‌కు చెందిన బైరిశెట్టి రాగిణి 2012 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలైంది. ఈ సారి ప్రభాగ్‌ నంబరు 5 సి నుంచి శివసేన టికెట్‌పై పోటీ చేసిన ఆమెకు 8,437 ఓట్లు పోలవ్వగా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్వప్నాలి సాల్వీకి 6,182 ఓట్లు పోలయ్యాయి. ఇలా 2,255 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. రాగిణి బైరిశెట్టితోపాటు అయిదో నంబరు ప్రభాగ్‌లో విజయం సాధించిన నలుగురు అభ్యర్థులు శివసేన వారే కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)