amp pages | Sakshi

ప‌సిడి బుల్లెట్..

Published on Thu, 10/11/2018 - 01:27

భారత ‘గన్‌’ మళ్లీ గర్జించింది. గురి చూసి మళ్లీ పసిడి పతకాన్ని కొట్టింది. మంగళవారం మను భాకర్‌ బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... బుధవారం సౌరభ్‌ చౌధరీ బుల్లెట్‌కు మరో స్వర్ణం సొంతమైంది. ఫలితంగా యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. ఓవరాల్‌గా భారత్‌ మూడు స్వర్ణాలు, మూడు రజతాలతో కలిపి మొత్తం 6 పతకాలతో మూడోస్థానంలో ఉంది.

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): ఇటీవలే ఆసియా క్రీడల్లో, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన స్వర్ణ పతకాలు గాలివాటమేమీ కాదని 16 ఏళ్ల భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌధరీ నిరూపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా గురి తప్పని ప్రదర్శనతో యూత్‌ ఒలింపిక్స్‌లోనూ అదరగొట్టాడు. ఫలితంగా బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ బంగారు పతకాన్ని కొల్లగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్‌ ఫైనల్లో 244.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. సుంగ్‌ యున్‌హో (దక్షిణ కొరియా–236.7 పాయింట్లు) రజతం, సొలారీ జాసన్‌ (స్విట్జర్లాండ్‌–215.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. సౌరభ్, సుంగ్‌ యున్‌హో మధ్య ఏకంగా 7.5 పాయింట్ల తేడా ఉండటం భారత షూటర్‌ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లోనూ సౌరభ్‌ తన జోరు ప్రదర్శించాడు. 580 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టాప్‌–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. 

కాంస్యం కోసం అర్చన పోరు... 
టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అర్చన కామత్‌ కాంస్య పతకానికి విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో అర్చన 3–11, 7–11, 6–11, 11–1, 5–11తో సున్‌ యింగ్‌షా (చైనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం ఆండ్రియా (రొమేనియా)తో అర్చన ఆడనుంది. 

హాకీ జట్టుకు తొలి ఓటమి... 
ఫైవ్‌–ఎ–సైడ్‌ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆతిథ్య అర్జెంటీనాతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–5 గోల్స్‌ తేడాతో ఓడింది. భారత్‌ తరఫున రీత్, ముంతాజ్‌ ఖాన్‌ ఒక్కో గోల్‌ చేశారు. ఆరు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌ మూడు విజయాలు సాధించి 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)