amp pages | Sakshi

టీమిండియాలో కాకినాడ కుర్రాడు

Published on Fri, 08/24/2018 - 13:22

కాకినాడ: విహారి... ఇప్పుడీపేరు తెలియని క్రికెట్‌ అభిమాని లేడు. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ టీం ఇండియాలో స్థానం దక్కించుకున్న హనుమ విహారి ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు ?  ఇదే ఇప్పుడు క్రికెట్‌ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. జాతీయ క్రికెట్‌ జట్టులో స్థానం దక్కించుకున్న విహారి కాకినాడలో పుట్టి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయం గోదావరి ప్రాంతవాసులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది.

కాకినాడలో జననం
టీమ్‌ ఇండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్‌ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ  సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు.

స్ఫూర్తి ప్రదాయిని తల్లే
చిన్ననాటి నుంచి విహారి క్రీడలపై ఆసక్తి కనబరిచేవాడు. ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్‌పై మక్కువ చూపేవాడు. తల్లి క్రికెట్‌లో సచిన్, ద్రావిడ్‌ వంటి క్రీడాకారులు ఎంత కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్నారో తరచూ చెబుతుండడంతో క్రికెట్‌పై విహారికి మక్కువ పెరగసాగింది. క్రికెట్‌ పట్ల ఆసక్తి పెరగడంతో బాగా రాణించగలిగాడు. ఏడో ఏట హైదరాబాద్‌లో సెయింట్‌ జాన్‌ క్రికెట్‌ అకాడమీలో క్రికెట్‌ కోచ్‌ జాన్‌మోజెస్‌ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందాడు.

అనతికాలంలోనే..
క్రికెట్‌లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012 అండర్‌–19 ప్రపంచ కప్‌ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీపోటీల్లో మరింతగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీమ్‌ ఇండియాలో స్థానం దక్కించుకున్నాడు. ఇక్కడే పుట్టి... ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ టీమ్‌ ఇండియాలో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ క్రీడాకారుల్లో ఎంఎస్‌కే ప్రసాద్‌ తరువాత విహారే. విహారి ప్రస్తుత తరం క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాడని, బాలుర, బాలికల జిల్లా క్రికెట్‌ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కేవీఎస్‌ కామరాజు, కిరణ్‌రాజ్, సంయుక్త కార్యదర్శి కొండలరావు, పీడీ స్పర్జన్‌రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంకిత భావంతో తన కుమారుడు చేసిన కృషి ఈ స్థాయికి తెచ్చిందని అతని తల్లి విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.

విహారికి అభినందనల వెల్లువ
భానుగుడి (కాకినాడ సిటీ): ఆంధ్ర రంజీట్రోఫీ లో నిలకడైన ప్రదర్శనకు  చక్కటి గుర్తింపు తెచ్చుకుని ఇంగ్లండ్‌లో జరగనున్న చివరి రెండు టెస్ట్‌లకు భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకున్న  జిల్లాకు చెందిన ఆటగాడు గాదె హనుమ విహారి అభినందనీయుడని జిల్లా బాలుర, బాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేవీఎస్‌డీ కామరాజు అన్నారు.  జిల్లా బాలుర, బాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడలో గురువారం కామరాజు అధ్యక్షతన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అండర్‌ 16 నుంచి నిలకడగా ఆడుతూ జిల్లాకు మంచిపేరు తీసుకువచ్చిన క్రికెట్‌ క్రీడాకారుడు హనుమ విహారి అని అన్నారు.

సంఘ కార్యదర్శి కేఎస్‌ కిరణ్‌రాజు మాట్లాడుతూ కాకినాడకు చెందిన విహారి ఇండియా ఏ టీమ్‌లో అద్భుతంగా ఆడాడని, అక్కడ ప్రతిభను గుర్తించి జాతీయ జట్టుకు ఎంపిక చేశారన్నారు. ఆంధ్రా నుంచి టెస్ట్‌ మ్యాచ్‌కు ఎంపికైన వారిలో ఎంఎస్‌కే ప్రసాద్‌ తరువాత స్థానం విహారిదే అన్నారు.  రంగరాయ మెడికల్‌ కళాశాల పీడీ డాక్టర్‌ కె. స్పర్జన్‌రాజు మాట్లాడుతూ క్రికెట్‌ మీద ఉన్న అంకిత భావంతో ఆడటం వలనే విహారి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని, జిల్లా సంఘం కూడా విహారికి మంచి ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. జిల్లా బాలుర, బాలికల  క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ,  జాయింట్‌ సెక్రటరీ ఐ. కొండలరావు, ట్రెజరర్‌ వైవీఎస్‌ నాయుడు, హెడ్‌ కోచ్‌లు డి. రవికుమార్, ఎమ్వీ నగేష్, ఎన్‌. రవికుమార్, జీడీ ప్రసాద్, జె.హరినాథరెడ్డి, ఎం. సత్యనారాయణ విహారికి అభినందనలు తెలిపారు.

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)