amp pages | Sakshi

ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ!

Published on Sun, 04/01/2018 - 15:09

జోహన్నెస్‌బర్గ్‌ : మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుంది ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి. ఇప్పటికే ట్యాంపరింగ్‌ వివాదంతో సీనియర్‌ ఆటగాళ్లైన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌లపై నిషేధంతో జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలను యువ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ టీమ్‌ పెయిన్‌కు అప్పగించింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో ఈ యువ సారథి గాయపడ్డాడు.

రెండో రోజు ఆటలో ఆసీస్‌ అరంగేట్ర ఆటగాడు చాద్‌ సేయర్స్‌ వేసిన బంతిని అందుకునే ప్రయత్నంలో టీమ్‌ పెయిన్‌ కుడి బొటన వేలికి ఫ్రాక్చర్‌ అయ్యింది. గాయంతో విలవిలాడిన అతను అసౌకర్యంగానే మ్యాచ్‌లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌లో సైతం ఆర్డర్‌ మార్చుకుని 7వ స్థానంలో బరిలోకి దిగాడు.

అయితే అతని బొటన వేలు చిట్లినట్లు ఫిజియోలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అతను ఈ టెస్టు చివరి వరకు కొనసాగడం కష్టంగా మారింది.  ఏ నిమిషంలోనైనా సిరీస్‌ నుంచి వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ టెస్టు ఆరంభం ముందే స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ కాలి గాయంతో సిరీస్‌ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌