amp pages | Sakshi

తెలుగు టైటాన్స్ జోరు కొనసాగేనా?

Published on Thu, 07/28/2016 - 15:01

హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-4లో అంచనాలు మించి రాణించిన జట్టు తెలుగు టైటాన్స్.  వరుస విజయాలతో దుమ్మురేపిన టైటాన్స్ ఇప్పుడు టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలించింది.  ఈ సీజన్లో తొలి  మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలై టోర్నీలో వెనుకబడిన తెలుగు టైటాన్స్ .. ఆ తరువాత అధ్బుతమైన ఆట తీరుతో చెలరేగిపోయింది.  ఈ టోర్నీలో ఎనిమిది విజయాలను కైవసం చేసుకున్న తెలుగు టైటాన్స్.. . రెండు మ్యాచ్లను టై చేసుకుని సెమీస్ బరిలో నిలిచింది. 

 

ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ తో పాటు, పాట్నా పైరేట్స్,  జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టాన్లు సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి..  తొలి సెమీస్లో పట్నా పైరేట్స్తో  పుణేరి పల్టాన్ తలపడుతుండగా, జైపూర్ పింక్ పాంథర్స్తో తెలుగు టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్లూ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి  గం.8.00ల.కు ఆరంభం కానున్నాయి.
 

ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ సీజన్ లో టైటిల్ ను కైవసం చేసుకోలేని తెలుగు టైటాన్స్ ఈసారి ఆ లక్ష్యం దిశగా సాగుతోంది.  ప్రొ కబడ్డీ-2 సీజన్ లో భాగంగా 2015లో ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ కు చేరిన టైటాన్స్.. గత సీజన్లో చివర్లో చతికిలబడి ఐదో స్థానానికే పరిమితమైంది.  అయితే ఈ సీజన్ ఆరంభంలో టైటాన్స్ పై పెద్దగా అంచనాలు లేవు. కొంతమంది కీలక ఆటగాళ్లు వేరే జట్లుకు మారడంతో టైటాన్స్  సెమీస్ కు చేరడం కష్టంగానే కనిపించింది. కాగా, కెప్టెన్ రాహుల్ చౌదరి,  సందీప్ నర్వాల్, సందీప్ ధుల్లు విశేషంగా రాణించడంతో టైటాన్స్ సులభంగానే సెమీస్ కు చేరుకుంది.

ఓవరాల్ ప్రొ కబడ్డీలో 400కు పైగా రైడింగ్ పాయింట్లు సాధించి రికార్డు సృష్టించిన రాహుల్.. ఈ సీజన్లో  123 రైడింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అత్యుత్తమ రైడర్ గా కొనసాగుతున్నాడు.  మరోసారి రాణించి తన జట్టును తొలిసారి ఫైనల్ కు చేర్చాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నాడు.  మరోవైపు తొలి సీజన్ లో టైటిల్ సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్.. ఈ సీజన్ లో ఎనిమిది విజయాలతో సెమీస్ కు చేరింది.  అయితే లీగ్ దశలో తలో మ్యాచ్లో గెలిచిన ఇరు జట్లు సెమీస్లో మరోసారి తమ సత్తా నిరూపించుకునేందుకు సన్నద్ధమయ్యాయి.. ప్రొ కబడ్డీ  టైటిల్ ను రెండోసారి తన ఖాతాలో వేసుకోవాలని జైపూర్ భావిస్తుండగా,  తొలిసారి టైటిల్ ను గెలిచి తీరాలని టైటాన్స్ పట్టుదలగా ఉంది.  దీంతో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)