amp pages | Sakshi

ఎవరు గెలిచినా చరిత్రే

Published on Sat, 06/08/2019 - 04:49

తొలి రౌండ్‌ నుంచి ఊహకందని రీతిలో సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం మ్యాచ్‌లకు నేడు అద్భుతమైన ముగింపు లభించనుంది. టైటిల్‌ ఫేవరెట్స్‌ అనుకున్న వారు క్వార్టర్‌ ఫైనల్లోపే ఇంటిముఖం పట్టడం... బరిలో ఉన్న మాజీ విజేతలు కూడా బోల్తా పడటంతో... ఈసారి మట్టికోర్టులపై కొత్త మహరాణి అవతరించనుంది.

అంచనాలకు మించి రాణించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ...చెక్‌ రిపబ్లిక్‌ టీనేజర్‌ మర్కెటా వొండ్రుసోవా నేడు జరిగే మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న జొహనా కొంటా (బ్రిటన్‌), అమండ అనిసిమోవా (అమెరికా) పోరాటం సెమీఫైనల్లో
ముగిసింది.


పారిస్‌: తమ కెరీర్‌లో ఏనాడూ ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)లలో ఒకరు నేడు తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించనున్నారు. టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఈ ఇద్దరు మహిళల సింగిల్స్‌ కిరీటం కోసం  శనివారం పోరాడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్, 23 ఏళ్ల యాష్లే బార్టీ 6–7 (4/7), 6–3, 6–3తో 17 ఏళ్ల అమెరికా టీనేజర్‌ అమండ అనిసిమోవాపై... అన్‌సీడెడ్‌ మర్కెటా వొండ్రుసోవా 7–5, 7–6 (7/2)తో 26వ సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్‌)పై విజయం సాధించారు.

ఇప్పటివరకు 18 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన బార్టీకి ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. మరోవైపు ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన వొండ్రుసోవా గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి తమ కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు తొలిసారి ‘గ్రాండ్‌’ టైటిల్‌ కోసం పోటీపడనున్నారు.  

తడబడి... తేరుకుని
క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)ను వరుస సెట్‌లలో ఓడించిన అనిసిమోవా సెమీస్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఆరంభంలో యాష్లే బార్టీ ఒక్కసారిగా విజృంభించి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లడంతోపాటు... 40–15 పాయింట్లతో సెట్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే అనిసిమోవా అనూహ్య పోరాటపటిమ కనబరిచింది. సెట్‌ పాయింట్‌ కాపాడుకోవడమే కాకుండా వరుస గేమ్‌లు గెలిచి 6–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. 12వ గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బార్టీ బ్రేక్‌ చేసి స్కోరును 6–6తో సమం చేసింది.టైబ్రేక్‌లో అనిసిమోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది.

అదే ఉత్సాహంతో అనిసిమోవా రెండో సెట్‌లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయందిశగా సాగిపోయింది. కానీ బార్టీ పట్టువదలకుండా పోరాడింది. రెండో సెట్‌లో వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌ను 6–3తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో యాష్లే బార్టీ సంయమనంతో ఆడి ఆరో గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ఓవరాల్‌గా ఎనిమిది బ్రేక్‌ పాయింట్లు సాధించింది.

అదే జోరు...
సెట్‌ కోల్పోకుండా సెమీస్‌ చేరిన వొండ్రుసోవా ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. కీలకదశలో నిగ్రహంతో ఆడి ఫలితాన్ని సాధించింది. తొలి సెట్‌లో ఒకదశలో వొండ్రుసోవా 3–5తో వెనుకబడి తన సర్వీస్‌లో మూడు సెట్‌ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత తేరుకొని సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో, 12వ గేమ్‌లో కొంటా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తొలి సెట్‌ను 7–5తో కైవసం చేసుకుంది.

రెండో సెట్‌లోనూ ఆరంభంలో కొంటా ఆధిపత్యం చలాయించింది. 3–1తో, 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీలకదశలో కొంటా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన వొండ్రుసోవా స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. దాంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో వొండ్రుసోవా పైచేయి సాధించి ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొండ్రుసోవా నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించింది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)