amp pages | Sakshi

స్టార్క్‌ 9.. ఆసీస్‌ భారీ విజయం

Published on Sun, 12/15/2019 - 19:48

పెర్త్‌: ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ మరోసారి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5  వికెట్లు సాధించిన స్టార్క్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించి కివీస్‌ పతనాన్ని శాసించాడు. స్టార్క్‌ దెబ్బకు 468 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆసీస్‌ 296 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో వాట్లింగ్‌(40), గ్రాండ్‌ హోమ్‌(33)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. మిగతా వారు విఫలం కావడంతో కివీస్‌ ఘోర పరాజయం తప్పలేదు.

ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 217/9 వద్ద డిక్లేర్డ్‌ చేయడంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఏమాత్రం పోరాడలేకపోయింది.  వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఒ‍త్తిడిలో పడిపోయింది. స్టార్క్‌కు జతగా నాథన్‌ లయన్‌ నాలుగు వికెట్లు సాధించడంతో కివీస్‌ రెండొందల పరుగుల మార్కును కూడా చేరలేకపోయింది. కమ్మిన్స్‌ రెండు వికెట్లు సాధించాడు. 167/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్‌ మరో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. దాంతో ఆసీస్‌కు 467 పరుగుల ఆధిక్యం లభించింది. ఆపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ పేకమేడలా కుప్పకూలింది. ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌