amp pages | Sakshi

సింహాలు ‘సఫా’

Published on Thu, 03/19/2015 - 00:49

ఆట పరంగా చూస్తే... అందరూ అనుభవజ్ఞులే... ఏ ఒక్కరు నిలిచినా... ఒంటిచేత్తో మ్యాచ్‌ను తారుమారు చేసే ఘనాపాఠిలే... కానీ మైదానంలోకి వచ్చేసరికి.... గౌరవాన్ని మించిన ఘనత, రికార్డులను మించిన నైపుణ్యం మూగబోయింది.. బాదేస్తారునుకున్న చోట... లంకేయులు బొక్క బోర్లాపడ్డారు... ‘ఆటా’డిస్తారనుకున్న చోట.... అప్పనంగా అప్పగించేశారు...
 
 ఫలితం.. సమ ఉజ్జీల సమరంగా మారుతుందనుకున్న పోరు కాస్త ఏకపక్షమైంది... బ్యాటింగ్ వికెట్‌పై బంతి నాట్యం చేసింది... సఫారీ పంజా దెబ్బకు ఘనత వహించిన మాజీ చాంపియన్లు... పసికూనలను తల పించారు... ఫేవరెట్‌గా బరిలోకి దిగిన లంక... ఘోరమైన పరాజయంతో ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది. ‘చోకర్స్’ ముద్రను తొలగించుకుంటూ దక్షిణాఫ్రికా తొలిసారి నాకౌట్ సమరంలో నెగ్గి సెమీస్‌కు చేరింది.
 
సిడ్నీ: నాకౌట్ మ్యాచ్ అంటే చేతులెత్తేస్తారని ‘చోకర్స్’ ముద్ర  పడ్డ దక్షిణాఫ్రికా ఈసారి ప్రపంచకప్‌లో జూలు విదిల్చింది. బలమైన ప్రత్యర్థి ఎదురైనా అద్భుతంగా ఆడింది. టోర్నీలో శతక్కొడుతున్న ఆటగాళ్లను కట్టడి చేస్తూ చెలరేగిపోయింది. డుమిని (3/29) హ్యాట్రిక్, తాహిర్ (4/26) స్పిన్ మ్యాజిక్‌తో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో... ఈనెల 24న జరిగే సెమీస్‌లో దక్షిణాఫ్రికా తలపడుతుంది.
 
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 37.2 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. సంగక్కర (96 బంతుల్లో 45; 3 ఫోర్లు), తిరిమన్నే (48 బంతుల్లో 41; 5 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ రీతిలో ఆడారు. సఫారీ పేసర్ల జోరుకు పెరీరా (3), దిల్షాన్ (0)లు 4 పరుగులకే అవుట్‌కాగా, 15వ ఓవర్ నుంచి రెండు ఎండ్‌లలో స్పిన్నర్లు దిగడంతో పరుగుల వేగం మందగించింది. ఈ దశలో సంగక్కర, తిరిమన్నే మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు.

అయితే స్వల్ప వ్యవధిలో తిరిమన్నే, జయవర్ధనే (4)లు పెవిలియన్‌కు చేరడంతో లంక కోలుకోలేకపోయింది. తర్వాత డుమిని స్పిన్ మ్యాజిక్‌ను చూపెట్టాడు. తన వరుస రెండు ఓవర్లలో ముగ్గుర్ని అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో లంక 116 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో ఓపికతో ఆడిన సంగ 37వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఈ దశలో వర్షం వల్ల కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. మ్యాచ్ తిరిగి ఆరంభమైన వెంటనే మలింగ (3) వికెట్ తీయడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. స్టెయిన్, అబాట్, మోర్కెల్ ఒక్కో వికెట్ తీశారు.
 
దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసి నెగ్గింది. డికాక్ (57 బంతుల్లో 78 నాటౌట్; 12 ఫోర్లు) చెలరేగగా... డుప్లెసిస్ (31 బంతుల్లో 21 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టిన ఓపెనర్ ఆమ్లా (23 బంతుల్లో 16; 1 ఫోర్) విఫలమయ్యాడు. మలింగ పరుగులు కట్టడి చేసినా.. కులశేఖర వేసిన నాలుగో ఓవర్‌లో డికాక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్‌లో ఊపు తెచ్చాడు. ఏడో ఓవర్‌లో ఆమ్లాను మలింగ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో డుప్లెసిస్.. వేగంగా ఆడుతున్న డికాక్‌కు మంచి సమన్వయాన్ని అందించాడు. భారీ షాట్లు కొట్టకపోయినా.. గ్యాప్‌ల్లో బౌండరీలు రాబడుతూ డికాక్ స్కోరుబోర్డును పరుగెత్తించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 11.2 ఓవర్లలో అజేయంగా 94 పరుగులు జోడించి సునాయాస విజయాన్ని అందించారు. తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
డుమిని ‘హ్యాట్రిక్’
పూర్తి బ్యాటింగ్ వికెట్‌పై సఫారీ పార్ట్‌టైమ్ స్పిన్నర్ డుమిని తన స్పిన్ మాయాజాలాన్ని చూపెట్టాడు. తన 8వ ఓవర్ చివరి బంతికి మ్యాథ్యూస్ (32 బంతుల్లో 19; 1 ఫోర్), 9వ ఓవర్ తొలి రెండు బంతులకు కులశేఖర (1), కౌశల్ (0) వికెట్లను పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. అయితే డుమిని వేసిన ఆఫ్‌సైడ్ బంతి కులశేఖర బ్యాట్‌ను తాకుతూ డికాక్ చేతిలోకి వెళ్లినా అంపైర్ అవుటివ్వలేదు. ఈ సమయంలో ప్రొటీస్‌కు రివ్యూ అవకాశం కూడా లేదు. కానీ కులశేఖర తనంతటకు తానుగా బయటకు వెళ్లిపోయి క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టమైంది.
 
 9    శ్రీలంకపై దక్షిణాఫ్రికాకు ఇదే పెద్ద విజయం (9 వికెట్ల తేడాతో).
 7    వన్డేల్లో స్పిన్నర్లు ఇన్ని వికెట్లు తీయడం దక్షిణాఫ్రికా తరఫున ఇదే మొదటిసారి.
 150 అత్యధిక వన్డేలకు ఆతిథ్యమిచ్చిన రెండో మైదానం సిడ్నీ. షార్జా స్టేడియం (218) ముందుంది.
 1    ప్రపంచకప్‌లో నాకౌట్ పోరులో గెలవడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి.
 0    మ్యాచ్‌లో ఒక సిక్సర్ కూడా నమోదుకాకపోవడం ఈ టోర్నీలో ఇదే మొదటిసారి.
 2    ఈ ప్రపంచకప్‌లో డుమినిది రెండో హ్యాట్రిక్. ఇంగ్లండ్ బౌలర్ ఫిన్ కూడా హ్యాట్రిక్ సాధించాడు.
 
 స్కోరు వివరాలు
 శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) డికాక్ (బి) అబాట్ 3; దిల్షాన్ (సి) డు ప్లెసిస్ (బి) స్టెయిన్ 0; సంగక్కర (సి) మిల్లర్ (బి) మోర్కెల్ 45; తిరిమన్నే (సి) అండ్ (బి) తాహిర్ 41; జయవర్ధనే (సి) డుప్లెసిస్ (బి) తాహిర్ 4; మ్యాథ్యూస్ (సి) డుప్లెసిస్ (బి) డుమిని 19; తిసారా పెరీరా (సి) రోసోవ్ (బి) తాహిర్ 0; కులశేఖర (సి) డికాక్ (బి) డుమిని 1; కౌశల్ ఎల్బీడబ్ల్యు (బి) డుమిని 0; చమీరా నాటౌట్ 2; మలింగ (సి) మిల్లర్ (బి) తాహిర్ 3; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: (37.2 ఓవర్లలో ఆలౌట్) 133.
 వికెట్ల పతనం: 1-3; 2-4; 3-69; 4-81; 5-114; 6-115; 7-116; 8-116; 9-127; 10-133.
 బౌలింగ్: స్టెయిన్ 7-2-18-1; అబాట్ 6-1-27-1; మోర్నీ మోర్కెల్ 7-1-27-1; డుమిని 9-1-29-3; తాహిర్ 8.2-0-26-4.
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) కులశేఖర (బి) మలింగ 16; డికాక్ నాటౌట్ 78; డుప్లెసిస్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: (18 ఓవర్లలో వికెట్ నష్టానికి) 134.
 వికెట్ల పతనం: 1-40.
 బౌలింగ్: మలింగ 6-0-43-1; దిల్షాన్ 2-0-10-0; కులశేఖర 1-0-13-0; తరిండ్ కౌశల్ 6-0-25-0; చమీరా 2-0-29-0; తిసారా పెరీరా 1-0-10-0. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)