amp pages | Sakshi

స్టీవ్‌ స్మిత్‌ ‘ఫిట్‌’ అయ్యాడు!

Published on Sat, 08/31/2019 - 11:23

డెర్బీ:  యాషెస్‌ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో గాయపడిన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ నాల్గో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన స్మిత్‌..  డెర్బీషైర్‌తో జరిగిన టూర్‌ మ్యాచ్‌లో నేరుగా పాల్గొన‍్నాడు. దాంతో నాల్గో టెస్టులో స్మిత్‌ ఆడటం దాదాపు ఖాయమే. డెర్బీ షైర్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 23 పరుగులు చేశాడు. మరొకవైపు మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దీనిపై సహచర ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ మాట్లాడుతూ.. ‘ స్మిత్‌ 20 పరుగులు కొట్టాడా.. 220 కొట్టాడా అనేది విషయం కాదు. అతనికి ప్రాక్టీస్‌ ఎంతవరకూ లభించిందనేది ముఖ్యం. స్మిత్‌ ఫిట్‌ అయ్యాడు’ అని పేర్కొన్నాడు.

యాషెస్‌ రెండో టెస్టులో ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అత్యంత వేగవంతంగా సంధించిన బౌన్సర్‌ స్మిత్‌ మెడ భాగంలో తగలడంతో అతను అక్కడికక్కడే కూలిబడిపోయాడు. ఆపై కాసేపటికి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌కు దూరమయ్యాడు. ఆపై మూడో టెస్టు నుంచి స్మిత్‌ వైదొలగక తప్పలేదు. కాగా, స్మిత్‌ గైర్హాజరీ ఒకటైతే, ఆ మ్యాచ్‌ను ఆసీస్‌ కోల్పోవడం కూడా వారిని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక నాల్గో టెస్టులో స్మిత్‌ రాకతో మళ్లీ గాడిలో పడతామని ఆసీస్‌ భావిస్తోంది. తొలి టెస్టులో ఆసీస్‌ గెలవగా, రెండో టెస్టు డ్రా ముగిసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌