amp pages | Sakshi

కావాలి...  మరో గెలుపు

Published on Sat, 01/26/2019 - 01:06

అలవోక గెలుపుతో న్యూజిలాండ్‌ పర్యటనలో శుభారంభం చేసిన టీమిండియా... ఆ ఊపును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించేందుకు సమాయత్తం అవుతోంది. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో కోహ్లి సేన ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. తొలి వన్డేలో స్పిన్నర్ల ప్రతాపాన్ని రుచి చూసిన ఆతిథ్య న్యూజిలాండ్‌... ఆ మేరకు తమ కూర్పులో మార్పుతో బరిలో దిగనుంది. ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్‌ భావిస్తుండగా... సొంతగడ్డపై పట్టు జారకుండా చూసుకునే ప్రయత్నంలో కివీస్‌ ఉంది.

మౌంట్‌ మాంగనీ: సాదాసీదాగా సాగి... తక్కువ స్కోర్లతో అభిమానులను నిరుత్సాహపరిచింది తొలి వన్డే. అయితే, పరుగుల వరద పారే పిచ్‌తో ఆ లోటును సంపూర్తిగా తీర్చేందుకు సిద్ధమైంది మౌంట్‌ మాంగనీలోని మైదానం. ఈ నెల ప్రారంభంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల స్కోర్లను పరిశీలిస్తే... భారత్, న్యూజిలాండ్‌ మధ్య శనివారం నాటి రెండో వన్డే ప్రేక్షకులను కనువిందు చేయనుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా గత మ్యాచ్‌ జట్టునే కొనసాగించనుండగా, న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌతీ స్థానంలో స్పిన్నర్‌ ఇష్‌ సోధిని ఆడించే అవకాశం కనిపిస్తోంది. మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నప్పటికీ నేపియర్‌లో తడబడి కుప్పకూలిన కివీస్‌... ఈసారి భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

మార్పేమీ లేకుండా... 
ఆస్ట్రేలియాతో చివరి వన్డేకు తప్పించిన అంబటి రాయుడును అనూహ్యంగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడించారు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బదులు కుల్దీప్‌ను ఎంచుకున్నారు. ఈ అవకాశాన్ని కుల్దీప్‌ ఉపయోగించుకున్నాడు. ఇక రాయుడిపై మరోసారి నమ్మకం ఉంచుతూ మార్పుల్లేకుండా రెండో వన్డే ఆడనుంది టీమిండియా. మరోవైపు ఓపెనర్లలో ధావన్‌ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. 4, 5 వన్డేలు, టి 20 సిరీస్‌కు సారథ్యం చేపట్టనున్నందున ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. ఆసీస్‌పై తొలి వన్డేలో సెంచరీ తర్వాత అతడు మళ్లీ స్థాయికి తగిన ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఇక్కడి బ్యాటింగ్‌ పిచ్‌పై వీరిద్దరూ మంచి ప్రారంభం ఇస్తే... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ దానిని మరింత పైకి తీసుకెళ్లే వీలుంటుంది. పేసర్‌ మొహమ్మద్‌ షమీ బౌలింగ్‌ పదునేంటో నేపియర్‌లో కివీస్‌కు తెలిసొచ్చింది. అతడితో పాటు భువనేశ్వర్‌ను ప్రత్యర్థి ఎదుర్కొనలేకపోయింది. వీరితో పాటు కుల్దీప్, యజువేంద్ర చహల్‌ మణికట్టు స్పిన్‌ మాయతో చుట్టేస్తే ఆతిథ్య జట్టుకు ఇక్కట్లు తప్పవు. 

స్పిన్నర్‌కు అవకాశం 
ఫ్లాట్‌ పిచ్‌పై ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తొలి వన్డేలో కివీస్‌ కుప్పకూలింది. సొంతగడ్డపై చెలరేగుతారని ఊహించిన బ్యాట్స్‌మెన్‌ కనీస స్కోర్లూ చేయకలేకపోయారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒక్కడే పోరాడాడు. రెండో వన్డేలో భారత బౌలింగ్‌ దళానికి విధ్వంసక గప్టిల్, మున్రో, రాస్‌ టేలర్, నికోల్స్‌ ఎలా జవాబిస్తారో చూడాలి. నలుగురు పేసర్లతో బరిలో దిగినా, స్కోరు బోర్డుపై పెద్దగా పరుగులు లేకపోవడంతో వారు చేసేదేమీ లేకపోయింది. భారత స్పిన్నర్ల బౌలింగ్‌ తీరు చూశాక పొరపాటును గ్రహించినట్లుంది. దీంతో శనివారం మ్యాచ్‌కు సౌతీని తప్పించి స్పిన్నర్‌ సోధిని ఆడించనుంది. ఏదేమైనా బ్యాట్స్‌మెన్‌ రాణింపుపైనే న్యూజిలాండ్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. 

పిచ్, వాతావరణం 
మౌంట్‌ మాంగనీ పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్‌–శ్రీలంక మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లోనూ పరుగులు పోటెత్తాయి. తొలుత పేసర్లకు అనుకూలించినా, మ్యాచ్‌ సాగేకొద్దీ వారి ప్రభావమూ నామమాత్రమే అవుతుంది.

►ఈ మైదానంలో భారత్, కివీస్‌ తొలిసారి తలపడనున్నాయి. న్యూజిలాండ్‌ మాత్రం ఈ వేదికపై ఆరు మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది.

తుది జట్లు అంచనా

భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాయుడు, ధోని, జాదవ్, శంకర్, కుల్దీప్, చహల్, భువనేశ్వర్, షమీ. 
న్యూజిలాండ్‌: గప్టిల్, మున్రో, విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్, లాథమ్, నికోల్స్, సాన్‌ట్నర్, సౌతీ/సోధి, ఫెర్గూసన్, బ్రాస్‌వెల్, బౌల్ట్‌.   
► ఉదయం 7.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)