amp pages | Sakshi

ఆ విషయంలో చహర్‌ అద్భుతం : రోహిత్‌ శర్మ

Published on Fri, 04/19/2019 - 08:45

న్యూఢిల్లీ : ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ యువ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. చహర్‌ చాలా తెలివైనవాడని కితాబిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడని కొనియాడాడు. గురువారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చహర్‌ (3/19) స్పిన్‌ దాటికి ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చహర్‌ అద్భుత ప్రదర్శనకు ముగ్ధుడైన రోహిత్‌.. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఈ యువ స్పిన్నర్‌ను ఆకాశానికెత్తాడు.

‘ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసే విషయంలో చహర్‌ మొత్తానికి ఎదో చేశాడు. అతను గతేడాది కూడా జట్టులో ఉన్నప్పటికి ఆడే అవకాశం అంతగా రాలేదు. ఒక దశలో మేం అతనికి అవకాశం కల్పించాం. తను ఏం చేయాలో దాన్ని పర్‌ఫెక్ట్‌గా అమలు చేస్తాడు. తన వ్యూహాన్ని అమలు పరచడంలో చాలా తెలవిగా వ్యవహరిస్తాడు. లెఫ్టాండర్స్‌కు బౌలింగ్‌ చేయడంపై చాలా విశ్వాసంగా ఉంటాడు. కెప్టెన్‌ అతనిపై నమ్మకం ఉంచితే చాలా ఇరగదీస్తాడు. ఇక తొలి రెండు ఓవర్ల తర్వాత 140 పరుగుల లక్ష్యం చాలులే అనుకున్నాం. మేం అందరం అలానే భావించాం. కానీ అదృష్టవశాత్తు.. మా చేతిలో వికెట్లు ఉన్నాయి. డెత్‌ ఓవర్లలో పరుగులు చేయడానికి మా పవర్‌ హిట్టర్స్‌ ఉపయోగించాలనుకున్నాం. మా స్పిన్నర్ల నైపుణ్యం మాకు తెలుసు. మా ప్రణాళికను విజయవంతగా అమలు చేశాం’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా (26 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు), డి కాక్‌ (27 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రబడ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసి ఓడింది. శిఖర్‌ ధావన్‌ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. రాహుల్‌ చహర్‌ (3/19) స్పిన్‌తో అలరించాడు. హార్దిక్‌ పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

Videos

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)