amp pages | Sakshi

ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్‌ 

Published on Wed, 03/27/2019 - 01:28

ఫ్లోరిడా: మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ఫెడరర్‌ 7–5, 6–3తో ఫిలిప్‌ క్రాజినోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఫెడరర్‌కిది 52వ విజయం కావడం విశేషం. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ 14 ఏస్‌లు సంధించాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రష్యా యువ సంచలనం డానిల్‌ మెద్వెదెవ్‌తో ఫెడరర్‌ ఆడతాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ 7–6 (7/5), 6–7 (5/7), 7–6 (7/0)తో రీలి ఒపెల్కా (అమెరికా)పై గెలిచాడు. గత ఏడాది కాలంలో మెద్వెదెవ్‌ మూడు టైటిల్స్‌ సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.  

హలెప్‌ ముందంజ... 
ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ హలెప్‌ (రొమేనియా) క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హలెప్‌ 6–3, 6–3తో 38 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)పై విజయం సాధించింది. మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఒసాకా (జపాన్‌)పై నెగ్గిన సు వె సెయి (చైనీస్‌ తైపీ) మరో గొప్ప విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సు వె సెయి 6–3, 6–7 (0/7), 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌)ను ఓడించింది. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–3 తో గార్సియా (ఫ్రాన్స్‌)పై, ఐదో సీడ్‌  ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 2–6, 6–3, 7–5తో యులియా (కజకిస్తాన్‌)పై గెలిచారు.    

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)