amp pages | Sakshi

చరిత్ర సృష్టించిన ఆంధ్ర

Published on Sun, 10/04/2015 - 23:54

 తొలిసారి ముంబైపై ఆధిక్యం
 రంజీ మాజీ చాంపియన్‌తో మ్యాచ్ ‘డ్రా’
 ఆరు వికెట్లతో రాణించిన అయ్యప్ప
 
 విజయనగరం: మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలోని ఆంధ్ర క్రికెట్ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తమ రంజీ చరిత్రలో తొలిసారిగా పటిష్ట ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఆంధ్రకు మూడు పాయింట్లు, మాజీ చాంపియన్ ముంబైకి ఓ పాయింట్ దక్కింది. చివరి రోజు ఆదివారం ఆంధ్ర పేసర్ బండారు అయ్యప్ప ఆరు వికెట్లతో హడలెత్తించడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. సిద్ధేశ్ లాడ్ (163 బంతుల్లో 86; 12 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. 37 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను అయ్యప్ప పడగొట్టడంతో ఆంధ్రకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (106 బంతుల్లో 59; 10 ఫోర్లు; 1 సిక్స్), కైఫ్ (135 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది.
 
 గోవాకు మూడు పాయింట్లు
 గోవా: హైదరాబాద్, గోవా జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌కు చివరి రోజు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే 100 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గోవా జట్టుకు మూడు పాయింట్లు లభించగా, హైదరాబాద్‌కు ఓ పాయింట్ దక్కింది. ఆదివారం చివరి రోజు 349/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన గోవా వర్షం కురిసే సమయానికి  140.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 425 పరుగులు చేసింది. షగున్ కామత్ (286 బంతుల్లో 109; 11 ఫోర్లు; 1 సిక్స్) శతకం సాధించాడు. అంతకుముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)