వారెవ్వా... పేస్

Published on Mon, 02/02/2015 - 01:48

41 ఏళ్ల వయస్సులో 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్
హింగిస్‌తో కలిసి ‘మిక్స్‌డ్’ విభాగంలో విజేత
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడోసారి ఈ ఘనత

మెల్‌బోర్న్: ఉత్సాహానికి అనుభవం తోడైతే అద్భుత ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు.34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి 41 ఏళ్ల లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ జంట డానియల్ నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్)ను ఓడించింది.

ఓవరాల్‌గా పేస్ కెరీర్‌లో ఇది 15 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఇందులో ఎనిమిది పురుషుల డబుల్స్ విభాగంలో, ఏడు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పేస్‌కిది మూడో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్. గతంలో మార్టినా నవ్రతిలోవా (2003లో); కారా బ్లాక్ (2010లో) లతో కలసి అతను చాంపియన్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన పేస్-హింగిస్ జంటకు 1,42,500 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 68 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
 
హోరాహోరీగా సాగుతుందనుకున్న ఫైనల్ పేస్, హింగిస్ ధాటికి ఏకపక్షంగా ముగిసింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మూడు పదుల వయసు దాటినప్పటికీ పేస్, హింగిస్‌లిద్దరూ ఆద్యంతం సమన్వయంతో కదలడం, కీలకదశలో పాయింట్లు రాబట్టడంతో నెస్టర్-మ్లడెనోవిచ్ జంట ఏదశలోనూ తేరుకోలేకపోయింది.
 
‘‘ఆస్ట్రేలియాకు క్రమం తప్పకుండా రావడం, విజేతగా నిలువడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. హింగిస్‌తో  కలిసి ఆడటం ఆనందంగా అనిపించింది. ఆమె ఆట నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను.’’              -పేస్

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)