ఇష్‌ పోరాటం.. అద్భుత విజయం

Published on Tue, 04/03/2018 - 13:44

క్రైస్ట్‌చర్చ్‌: ఏడుగురు ఫీల్డర్లను దగ్గరగా మొహరించినా మొండిగా పోరాడాడు. అడ్డుగోడలా నిలిచి జట్టుకు చిరస్మరనీయమైన విజయాన్ని అందించాడు. ఇష్‌ సోధీ ఒంటరి పోరాటం చేయటంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ను న్యూజిలాండ్‌ డ్రాగా ముగించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో న్యూజిలాండ్‌ గెలుచుకుంది. ఇప్పటికే ఆక్లాండ్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను కివీస్‌ గెలిచిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ను కివీస్‌ చేజిక్కించుకుంది. గతంలో 1983-84లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను న్యూజిలాండ్‌ గెలిచింది.

రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్‌కు పలుమార్లు వాతావరణం అడ్డంకిగా నిలిచింది. వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులతో ఐదో రోజు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌, స్కోర్ బోర్డ్‌లో ఒక్క పరుగు చేరకముందే కివీస్‌ బ్యాట్స్‌మన్‌ రావల్‌(17).. బ్రాడ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ వారి ముందు నిలువలేకపోయారు. ఓ వైపు లాథమ్‌(82) ఒంటరి పోరాటం చేసినా సహచరులు నుంచి సహకారం అందలేదు. లాథమ్‌ వెనుదిరిగాక ఇష్‌ సోధీ (56; 200 బంతులు, 9ఫోర్లు) ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్‌ గెలుపును అడ్డుకోవడంతో రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నకివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్’‌, సిరీస్‌లో నిలకడగా రాణించిన ట్రెంట్‌ బౌల్ట్‌కు  ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డ్‌లు లభింబాయి.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ : 307 ఆలౌట్‌, 352/9 డిక్లేర్డ్‌ 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : 278 ఆలౌట్‌, 256/8

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ