amp pages | Sakshi

సెహ్వాగ్‌కు కౌంటర్‌ ఇచ్చిన హేడెన్‌

Published on Tue, 02/12/2019 - 11:11

మెల్‌బోర్న్‌: బేబీ సిట్టర్‌.. ఈ మధ్య క్రికెట్‌లో బాగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం ముమ్మాటికీ రిషభ్‌ పంతే. ఇటీవల ఆసీస్‌ పర్యటనకు టీమిండియా వెళ్లినప్పుడు పంత్‌ బేబీ సిట్టర్‌ పేరుతో హాట్‌ టాపిక్‌గా మారాడు. దీనిపై ఏకంగా స్టార్‌ స్పోర్ట్స్‌ యాడ్‌ తీసేసింది. ఇందతా టీమిండియా కోసమే అనుకోండి. ఈ నెల చివర్లో భారత పర్యటనకు ఆసీస్‌ రానున్న తరుణంలో ఈ యాడ్‌ను రూపొందించింది స్టార్‌ స్పోర్ట్స్‌.

అందులో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ బేబీసిట్టర్‌ అవతారం ఎత్తాడు. ఈ వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో, సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. కాగా,  దీనిపై ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ప్రధానంగా ఆసీస్‌ జట్టు జెర్సీలతో యాడ్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చేశాడు. వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్‌ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలన్నాడు. ఈ మేరకు  తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా స్పందించిన హేడెన్‌.. యాడ్‌ చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ను, యాడ్‌ రూపొందించిన స్టార్‌ స్పోర్ట్స్‌లను ట్యాగ్‌ చేశాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌