amp pages | Sakshi

ఇవనోవిచ్ ఇంటికి...

Published on Sun, 05/29/2016 - 00:15

మూడో రౌండ్‌లోనే ఓడిన మాజీ చాంపియన్
ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా, వీనస్

 
పారిస్: కొంతకాలంగా ఫామ్‌లో లేని ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ నిరాశే మిగిలింది. గతేడాది ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరిన ఈ సెర్బియా బ్యూటీ ఈసారి మాత్రం మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. 2008 చాంపియన్, 14వ సీడ్ ఇవనోవిచ్  శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో 4-6, 4-6తో 24వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఇవనోవిచ్, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 29 అనవసర తప్పిదాలు చేసిన ఈ సెర్బియా స్టార్ తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.


మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన మూడో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-4, 7-6 (12/10)తో 26వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో పార్మెంటియర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 7-6 (7/5), 1-6, 6-0తో కార్నెట్ (ఫ్రాన్స్)పై, 12వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) 6-4, 3-6, 6-1తో 22వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై, పుతింత్‌సెవా (కజకిస్తాన్) 6-1, 6-1తో కరీన్ (ఇటలీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు.

 పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), 13వ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెరర్ 6-4, 7-6 (8/6), 6-1తో 21వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై, థీమ్ 6-7 (4/7), 6-3, 6-3, 6-3తో జ్వెరెవ్ (జర్మనీ)పై నెగ్గారు. మరోవైపు ఆరో సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) గాయంతో మూడో రౌండ్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. గుల్బిస్ (లాత్వియా)తో జరి గిన మూడో రౌండ్‌లో సోంగా తొలి సెట్‌లో 5-2తో ఆధిక్యంలో ఉన్నపుడు గాయం కారణంగా నిష్ర్కమించాడు.

 క్వార్టర్ ఫైనల్లో పేస్-హింగిస్ జంట
మిక్స్‌డ్ డబుల్స్‌లో  లియాండర్ పేస్ (భారత్) -హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో పేస్-హింగిస్ ద్వయం 2-6, 7-5, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’ లో నాలుగో సీడ్ ష్వెదోవా (కజకిస్తాన్)- మెర్జియా (రుమేనియా) జోడీపై గెలిచింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)