amp pages | Sakshi

క్వాలిఫయర్‌ మ్యాచ్‌.. సరికొత్త రికార్డు

Published on Thu, 05/24/2018 - 18:59

సాక్షి, ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్‌)-11 లో రికార్డుల పర్వం తుది దశకు చేరుకుంది. తాజాగా ఐపీఎల్‌ వేదికగా మరో అరుదైన రికార్డు నమోదయింది. ఈ సారి ఏ బ్యాట్స్‌మనో, బౌలరో కాదు.. వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ హాట్‌స్టార్‌ ఓ రికార్డు సృష్టించింది. మంగళవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఒంటి చేత్తొ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే  విజయం కోసం ఇరు జట్ల మధ్య సాగిన హోరాహోరీ పోరును రికార్డు స్థాయిలో అభిమానులు హాట్‌స్టార్‌లో వీక్షించారు. 

ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ను ఏకంగా 8.26 మిలియన్ల మంది హాట్‌స్టార్‌ లైవ్‌ ద్వారా ఆస్వాదించారంట. ఈ విషయాన్ని సీఈఓ అజిత్‌ మోహన్‌ తెలియజేశారు. గతంలో హాట్‌స్టార్‌ ద్వారా 7 మిలియన్ల వ్యూస్‌ మాత్రమే గరిష్టమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు యూట్యూబ్‌ లైవ్‌ ద్వారా 80 లక్షల మంది ఓ కార్యక్రమాన్ని వీక్షించారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌.. సీఎస్‌కే మ్యాచ్‌తో ఆ రికార్డును హాట్‌స్టార్ తిరగరాసింది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)