amp pages | Sakshi

వన్డే సిరీస్‌ భారత్‌దే

Published on Thu, 04/12/2018 - 17:36

నాగ్‌పూర్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో గెలుచుకుంది.  గురువారం విదర్భ స్టేడియంలో  జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించిన భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ను భారీ స్కోర్‌ చేయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో జేమ్స్‌(94; 119 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. భారత బౌలర్లలో గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్‌, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు సాధించారు. 

ఆ తర్వాత 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23 పరుగులకే రోడ్రిగ్స్‌, వేదా కృష్ణమూర్తి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో మరో ఓపెనర్‌ స్మృతి మంధన (53 రిటైర్డ్‌ హర్ట్‌;67 బంతుల్లో 6ఫోర్లు) తో కలిసి కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(74నాటౌట్‌; 124 బంతుల్లో 9ఫోర్లు) ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. మంధన ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(54నాటౌట్‌; 61 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్‌) మెరుపు బ్యాటింగ్‌ చేసి భారత్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ ష్రబ్‌సోల్‌ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన దీప్తిశర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌లో నిలకడగా రాణించిన స్మృతి మంధన ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకున్నారు.  

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌