వారికి విశ్రాంతి..ఈ ముగ్గురికీ అవకాశం

Published on Fri, 01/31/2020 - 12:16

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే  కైవసం​ చేసుకున్న టీమిండియా మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాల్గో టీ20లో కూడా జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కివీస్‌.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌ చేయాల్సిందిగా ఆహ్వానించింది.  కాగా, తాజా మ్యాచ్‌కు కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా విలియమ్సన్‌ తప్పుకున్నాడు. దాంతో కివీస్‌ కెప్టెన్‌గా టిమ్‌ సౌతీ వ్యవహరించనున్నాడు. కాగా, భారత్‌ జట్టు పలు కీలక మార్పులు చేసింది. సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సైనీలు తుది జట్టులోకి వచ్చారు. అదే సమయంలో రోహిత్‌, జడేజా, షమీలకు విశ్రాంతి ఇచ్చారు.

హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన టీమిండియా.. అదే ఊపును కొనసాగించి ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు సన్నద్ధమైంది. తాజా ఫామ్‌ ప్రకారం చూస్తే మన జట్టును అడ్డుకోవడం ప్రత్యర్థికి దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్‌ చెలగాటం...మరోవైపు న్యూజిలాండ్‌కు ప్రాణసంకటంగా తయారైంది. సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ను చేజార్చుకుంది. తమ అత్యుత్తమ ప్రదర్శన తర్వాత కూడా గెలుపు గీత దాటలేకపోవడం జట్టును తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో కివీస్‌ బృందం ఉంది. (ఇక్కడ చదవండి: మ్యాచ్‌ తర్వాత కోహ్లి అచ్చం..)

గత మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతోనే కివీస్‌ మ్యాచ్‌ చేజార్చుకుంది.  చివరి 4 బంతుల్లో విజయానికి 2 పరుగులు కావాల్సిన తరుణంలో దాన్ని  ఛేదించలేకపోయింది. చివరకు మ్యాచ్‌ టైగా ముగియడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఆ సూపర్‌ ఓవర్‌ భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ పొరపాట్లను మళ్లీ రిపీట్‌ చేయకుండా సత్తా చాటాలంటే మానసికంగా జట్టు మరింత దృఢంగా మారాల్సిందే. 

తుది జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, సంజూ శాంసన్‌, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్, చహల్‌, బుమ్రా, సైనీ.  
న్యూజిలాండ్‌: టిమ్‌ సౌతీ(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్, మన్రో, రాస్‌ టేలర్, టామ్‌ బ్రూస్‌, డరైన్‌ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్‌లీన్, సోధి, బెన్నెట్‌.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)