amp pages | Sakshi

కోహ్లి క్యాచ్‌.. లబుషేన్‌ షాక్!

Published on Sun, 01/19/2020 - 16:14

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. జట్టుకు కీలకమైన సమయంలో క్యాచ్‌ అందుకుని పర్యాటక ఆసీస్‌ జట్టును దెబ్బతీశాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్టీవ్‌ స్మిత్‌తో కలిసి లబుషేన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం ఇరువురు అర్దసెంచరీలు పూర్తిచేశారు. 

ఈ జోడి మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించి టీమిండియాకు ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో రవీంద్ర జడేజా వీరిద్దరిని విడదీశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 32 ఓవర్‌ మూడో బంతిని లబుషేన్‌ కవర్‌ వైపు భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి కళ్లు చెదిరేరీతిలో డైవ్‌ చేస్తూ రెండు చేతులా బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో లబుషేన్‌ షాక్‌తో క్రీజు వదిలి వెళ్లాడు. కోహ్లి క్యాచ్‌తో టీమిండియా ఆటగాళ్లతో పాటు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ కూడా ఆనందంలో మునిగిపోయారు. లబుషేన్‌ నిష్క్రమణ తర్వాత అనూహ్యంగా మిచెల్‌ స్టార్క్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో స్టార్క్‌(0) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌