amp pages | Sakshi

సారీ భయ్యా..: హార్ధిక్ పాండ్యా

Published on Thu, 04/19/2018 - 17:22

సాక్షి, ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)-11లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ సమయంలో కీపర్ హెల్మెట్‌ ధరించక పోవడంతో హార్దిక్ పాండ్యా త్రో విసిరిన బంతి నేరుగా ఇషాన్ కిషన్ కుడి కనుబొమ్మకు తగిలింది. దీంతో అతను విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ముంబై జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక కిషాన్‌ స్థానంలో రంజీ ఆటగాడు ఆదిత్య తారే కీపింగ్‌ చేశాడు.

ఈ ఆకస్మిక ఘటనతో పాండ్యా మాత్రం తెగ భయపడ్డాడు. అతనికి తీవ్రంగా గాయమైందేమోనని ఆందోళన చెందాడు. అయితే ఈ వ్యవహారంలో పాండ్యా తప్పులేకున్నా.. తన వల్ల ఓ ఆటగాడు గాయపడ్డాడని ఈ ఆల్‌రౌండర్‌ తీవ్ర మథనపడ్డాడు. గాయం తీవ్రమైంది కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు పాండ్యా, ఇషాన్‌ను కలిశాడు. అతడితో ఫొటో దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. నా ప్రియమైన సోదరుడా నన్ను మన్నించు.. దృఢంగా నిలబడు అని వ్యాఖ్యానించాడు. కాగా, 2018 ఐపీఎల్ వేలంలో ఇషాన్‌ను రూ.6.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. 


 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌