amp pages | Sakshi

వైరల్‌ : దాదాతో డ్యాన్స్‌ చేయించిన ‍హర్భజన్‌

Published on Tue, 01/14/2020 - 09:46

కోల్‌కతా : టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఎక్కడ ఉంటే అక్కడ తన అల్లరితో అందరిని అలరిస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, హర్భజన్‌లు కలిసి 'సెనోరిటా' పాటకు తమ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో అదరగొట్టిన వీడియో ఒకటి వైరల్‌ అయింది. వివరాలు..  బెంగాలీకి చెందిన ఒక టెలివిజన్‌ చానెల్‌లో దాదాగిరి అన్‌లిమిటెడ్‌ పేరుతో ఆదివారం ఒక షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కాగా ఈ షోకు పలువురు భారత క్రికెటర్లను ఆహ్వానించారు. వీరేంద్ర సెహ్వాగ్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ కైఫ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. కాగా ఎపిసోడ్‌ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.(ఆ మ్యాచ్‌తోనే హర్భజన్‌కు ఫిదా అయ్యా : గంగూలీ)

అయితే కార్యక్రమం మధ్యలో ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్‌ 'సెనోరిటా' అనే పాపులర్‌ పాటను ఆలపించారు. ఉషా ఉతుప్‌ పాడిన పాటకు హర్భజన్‌ డ్యాన్స్‌ చేయడమే గాక దాదాతోను కొన్ని డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేయించాడు. అయితే ఇదంతా గమనిస్తున్నఇతర క్రికెటర్లు క్లాప్స్‌ కొడుతూ వారిద్దరిని ఎంకరేజ్‌ చేశారు. మొదట గంగూలీ డ్యాన్స్‌ చేయడానికి కొంత ఇబ్బంది పడినా చివరకు భజ్జీ సాయంతో డ్యాన్స్‌ బాగానే చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన క్రికెటర్లలో ఒక్క అశ్విన్‌ తప్ప మిగతా అందరూ దాదా నాయకత్వంలో ఆడినవారే కావడం గమానార్హం.అయితే ఈ వీడియోను సదరు చానెల్‌ యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రసుత్తం వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.(‘గంగూలీ.. మీరు ఒప్పు కోవద్దు’)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌