amp pages | Sakshi

నిరాశపరిచిన మెస్సీ.. మ్యాచ్‌ డ్రా

Published on Sat, 06/16/2018 - 21:14

మాస్కో :  టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లోనే నిరాశపర్చింది. గ్రూప్‌ డిలో భాగంగా అర్జెంటీనా, ఐలాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. అందివచ్చిన పలు పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మలచటంలో అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ పూర్తిగా విఫలమయ్యాడు. మరో వైపు ఐలాండ్ గోల్‌కీప‌ర్ హానెస్ హాల్‌డోరసన్‌ క‌ళ్లు చెదిరే రీతిలో డైవ్‌లతో అర్జెంటీనా మరో గోల్‌ చేయకుండా అడ్డుకున్నాడు. మ్యాచ్‌ ప్రారంభమైన 19వ నిమిషంలో కున్‌ అగురో గోల్‌ చేసి అర్జెంటీనాకు తొలి గోల్‌ అందించాడు. ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు, 23వ నిమిషంలో ఫిన్‌బోగ్సన్‌ ఐలాండ్‌కు గోల్‌ అందించి స్కోర్‌ సమం చేశాడు. ప్రథమార్ధం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

అనంతరం ద్వితీయార్దంలో మరింత దూకుడు ప్రదర్శించినా గోల్‌ సాధించండంలో మాత్రం అర్జెంటీనా విఫలమైంది. పదేపదే వచ్చిన అవకాశాలను అర్జెంటీనా ఆటగాళ్లు, ముఖ్యంగా స్టార్‌ ఫుట్‌బాలర్‌ మెస్సీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బంతి పూర్తిగా అర్జెంటీనా ఆధీనంలో ఉంది. అర్జెంటీనా చేసిన ఏడు గోల్‌ ప్రయత్నాలను ఐలాండ్‌ గోల్‌ కీపర్‌ విజయవంతంగా అడ్డుకున్నాడు. అంతేకాక అర్జెంటీనాకు వచ్చిన 15 ఫ్రీకిక్‌లను ఉపయోగించుకోవడంలో విఫలం అయింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 4 అనవసర తప్పిదాలు చేయగా, ఐలాండ్‌ 9 తప్పిదాలు చేసింది.  


 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)