amp pages | Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ క్రికెటర్ పై కేసు

Published on Sat, 07/04/2015 - 18:59

మాంచెస్టర్:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ పట్టుబడ్డాడు. మద్యం సేవించి కారును డ్రైవ్ చేస్తుండగా గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు చేసిన తనిఖీల్లో  ఫాల్కనర్ దొరికిపోయాడు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కోర్టుకు తరలించారు. దీంతో అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసి.. జూలై 21 వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.

 

ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా తాగి డ్రైవ్ చేయడం వల్లే చోటు చేసుకునే పరిణామాల్ని గ్రహించాలని తాము ఫాల్కనర్ కు సూచించినట్లు టీమ్ ఫెర్మామెన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హావర్డ్ తెలిపాడు. ఇది చాలా నిరాశకు గురిచేసిందన్నాడు.  యువ క్రికెటర్లకు ఆదర్శం కావాల్సిన సీనియర్ క్రికెటర్ ఇలా చేయడం మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డాడు. ఈ తాజా ఉదంతంతో ప్రస్తుతం లాంక్ షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్ కు ఆడుతున్న ఫాల్కనర్ భవితవ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టుకు అతన్ని ఎంపిక చేసే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌