amp pages | Sakshi

డు ప్లెసిస్, డుమినీలకు విశ్రాంతి

Published on Tue, 01/17/2017 - 12:31

కేప్టౌన్:త్వరలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ల ట్వంటీ 20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి కీలక ఆటగాళ్లు డు ప్లెసిస్, జేపీ డుమినీలకు విశ్రాంతినిచ్చారు. తమ రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించుకునే క్రమంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా క్రికెట్ సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ మేరకు ఆరుగురు కొత్త ఆటగాళ్లను ట్వంటీ 20 స్క్వాడ్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

'మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో పలువురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చాం. అసలు మా క్రికెట్ బలం ఎంతవరకూ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. కొత్త ఆటగాళ్లతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా. డు ప్లెసిస్, డుమినీ, ఆమ్లా, ఏబీ డివిలియర్స్లతో పాటు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు శ్రీలంకతో సిరీస్లో ఆడటం లేదు. మా 'ఎ' జట్టులో ఆటగాళ్లను ఎంపిక చేద్దామనే విషయాన్ని మా సహచర కోచ్లకు తెలియజేశాను.

కొత్తగా జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు తొలి రోజు స్కూల్ వెళ్లిన ఫీలింగ్ ఉంటుంది. దేశం కోసం ఆడాలని చాలా మంది యువ క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు. అది మాకు ఎంతో ఉత్సాహాన్ని కల్గిస్తుంది' అని దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ డామిన్గో పేర్కొన్నాడు.  ఈ నెల 20వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య మూడు ట్వంటీ 20ల సిరీస్ ఆరంభం కానుంది.
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)