amp pages | Sakshi

ఇంగ్లండ్‌ ఇంటికి...

Published on Fri, 07/13/2018 - 01:05

‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’...! ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ ఒక్కో విజయం సాధిస్తున్న కొద్దీ కప్పు తమదేనంటూ ఆ దేశంలో మార్మోగుతున్నదీ పాట. వారికిదో జాతీయ గీతమైపోయింది కూడా. జట్టు ఫైనల్‌కు చేరకముందే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జనం టీవీలకు అతుక్కుపోయారు. ఆ దేశ టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ అయితే... తమ దృష్టంతా భారత్‌తో వన్డే సిరీస్‌ మీద కాక ఫుట్‌బాల్‌ సెమీఫైనల్‌ పైనే ఉందన్నాడు. అభిమానులు మరింత ముందడుగేసి ఆదివారం వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ వేళలు మార్చాలని, సంబరాలు జరుపుకోవడానికి సోమవారం ఏకంగా సెలవు ప్రకటించాలని డిమాండ్‌ చేసేశారు. కానీ ఈ కలంతా చెదిరింది. కలతే మిగిలింది. 

తమ చిన్న దేశానికీ ఒక జట్టుందని, అది ఈ స్థాయిలో ఆడుతుందని ఊహించని సగటు అభిమానికి క్రొయేషియా మాంచి కిక్‌ ఇచ్చింది. గోల్‌ మీద గోల్‌ కొట్టి లీగ్‌ దశలో అర్జెంటీనాను మట్టికరిపించి... ఒత్తిడిని ఓడించి డెన్మార్క్, రష్యాలను వరుసపెట్టి ‘పెనాల్టీ నాకౌట్‌’ చేసి... సెమీస్‌లో ఇంగ్లండ్‌పై శక్తికి మించి పోరాడి అద్భుతమే చేసింది. తమ చరిత్రలోనే గొప్పదనదగ్గ విజయంతో ప్రపంచ కప్‌లో తొలిసారి ఫైనల్‌ చేరింది. ఆదివారం టైటిల్‌ పోరులో ఫ్రాన్స్‌కు సవాల్‌ విసిరింది.  

మాస్కో :అంచనాలు లేకుండా వచ్చి, ఉత్కంఠను అధిగమిస్తూ ఒక్కో మ్యాచ్‌ నెగ్గుతూ వస్తున్న క్రొయేషియా... అంతే సంచలన  రీతిలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిం ది. బుధవారం అర్ధరాత్రి ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ రెండో సెమీఫైనల్లో ఆ జట్టు 2–1 తేడాతో మాజీ చాంపియన్‌ను ఓడించి ఇంటికి పంపింది. అంతకుముందు రెండు పెనాల్టీ షూటౌట్‌ మ్యాచ్‌లు ఆడినా, ఈసారి యువకులతో నిండిన ప్రత్యర్థితో తలపడుతున్నా, కనీసం సబ్‌స్టిట్యూట్‌ను కూడా దింపకుండా ఏకబిగిన 90 నిమిషాల పాటు ఒకే జట్టును కొనసాగించిన క్రొయేషియా తమ శ్రమకు తగ్గ ఫలితం పొందింది. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన కీరన్‌ ట్రిప్పియర్‌ (5వ నిమిషం) ఇంగ్లండ్‌ ఖాతా తెరవగా..., ఇవాన్‌ పెరిసిచ్‌ (68వ ని.), మాన్‌జుకిచ్‌ (109వ ని.) గోల్స్‌ కొట్టి క్రొయేషియాకు విజయం అందించారు.  

ఆరంభంలోనే ఆధిక్యం ఇచ్చినా... 
వేలాదిగా హాజరైన అభిమానుల మద్దతు మధ్య మైదానంలో దిగిన ఇంగ్లండ్‌కు... అందుకు తగ్గట్లే ఆరంభంలోనే గోల్‌ దక్కింది. క్రొయేషియా కెప్టెన్‌ మోడ్రిచ్‌ ఫౌల్‌ చేయడంతో లభించిన ఫ్రీ కిక్‌ను ట్రిప్పియర్‌ 20 గజాల దూరం నుంచి నెట్‌లోకి పంపి ఆధిక్యం అందించాడు. దీన్నుంచి తేరుకున్న క్రొయేషియా ప్రతి దాడులకు దిగింది. ఓ దశలో గోల్‌ చేసినంత పనిచేసింది. అయితే రక్షణ శ్రేణి లోపాలతో పదేపదే తప్పులు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ చక్కటి అవకాశాన్ని జారవిడిచాడు. సరిగ్గా గోల్‌పోస్ట్‌ ముందున్న అతడు బంతిని నేర్పుగా నెట్‌లోకి కొట్టలేకపోయాడు. 

ఖాతా తెరిచి... విరుచుకుపడి 
ఇరు జట్ల ఆటగాళ్లు వెంటవెంటనే ఎల్లో కార్డులు ఎదుర్కొనడంతో రెండో భాగం పోటాపోటీగా ప్రారంభమైంది. గోల్‌పోస్ట్‌ ముందు కేన్‌కు దక్కిన మరో అవకాశాన్ని బంతిని పక్కకునెట్టి లోవ్రెన్‌ నిర్వీర్యం చేశాడు. బాక్స్‌ ఏరియా ఆవల చాలా చాన్స్‌లు దొరికినా వ్యూహంతో కదలక చేజార్చుకున్న క్రొయేషియా... ఎట్టకేలకు 68వ నిమిషంలో సఫలమైంది. సైమ్‌ వాల్జ్‌కో అందించిన క్రాస్‌ను పెరిసిచ్‌ పొరపాటు లేకుండా హెడర్‌తో నెట్‌లోకి చేర్చాడు. తర్వాత ఒక్కసారిగా ఆ జట్టు విజృంభించడంతో ఆటే మారిపోయింది. పదేపదే దాడులతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించింది. పెరిసిచ్‌ కొట్టిన ఓ షాట్‌ చివరి క్షణంలో గోల్‌ బార్‌ను తగిలి పక్కకు పోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి స్కోరు సమం కావడంతో అదనపు అరగంట తప్పలేదు. టోర్నీలో జట్టుకు వెన్నెముకలా నిలిచిన కీపర్‌ జోర్డాన్‌ పిక్‌ఫోర్డే ఈసారి ఉదాసీనతతో ఇంగ్లండ్‌ కొంపముంచాడు. సాధారణ పాస్‌తో బంతిని అందుకుని 109వ నిమిషంలో గోల్‌పోస్ట్‌ ముందుకు వచ్చిన మాన్‌జుకిచ్‌ కొట్టిన షాట్‌... పిక్‌ఫోర్డ్‌ నిర్లిప్తతతో నెట్‌లోకి వెళ్లిపోయింది. సబ్‌స్టిట్యూట్‌ అవకాశాలు అయిపోయి, గాయంతో ట్రిప్పర్‌ మైదానం వీడటంతో చివర్లో ఇంగ్లండ్‌ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. మరో గోల్‌కు కూడా వీలు చిక్కకపోవడంతో ఆ జట్టు పరాజయ భారంతో మైదానం వీడింది. 

►వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్‌ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు. ఈ టోర్నీ మరో ఫైనలిస్టు ఫ్రాన్స్‌ 1998 వరల్డ్‌ కప్‌లో 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్‌ నెగ్గడం విశేషం.

►‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’ ఉంటూ ఉర్రూతలూగిన ఇంగ్లండ్‌ అభిమానులపై ప్రపంచ వ్యాప్తంగా వ్యంగ్య బాణాలు మొదలయ్యాయి. ‘ఎస్‌...ఇంగ్లండ్‌ కమింగ్‌ హోమ్‌’ అంటూ అన్ని వైపులనుంచి జనం విసుర్లతో విరుచుకు పడ్డారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)