amp pages | Sakshi

ఢిల్లీ టప టపా

Published on Sun, 04/26/2015 - 21:41

ఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల ధాటికి ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మన్ విలవిల్లాడారు. సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో స్వల్ప స్కోరుకే చాప చుట్టేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 18.2 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ దిగిన ఢిల్లీ తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. అగర్వాల్, డుమిని కాసేపు నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా ఆడారు. 36 పరుగుల వద్ద డుమిని(13) అవుటయ్యాక వికెట్ టపటపా పడ్డాయి. 39 పరుగుల వద్ద యువరాజ్(2), మాథ్యూస్(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు.

ఓపెనర్ అగర్వాల్, జాదవ్ కాసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. అగర్వాల్ 34 బంతుల్లో ఫోర్, సిక్సర్ తో 27 పరుగులు చేశాడు. 29 బంతుల్లో4 ఫోర్లతో 33 పరుగులు చేసిన జాదవ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాదవ్ 9వ వికెట్ అవుటవడంతో ఢిల్లీ 100 పరుగులు చేయలేకపోయింది. బెంగళూరు బౌలర్లలో స్టార్క్ 3, ఆరోన్ 2, వీసె 2 వికెట్లు పడగొట్టారు. పటేల్, ఇక్బాల్ అబ్దుల్లా చెరో వికెట్ తీశారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)