amp pages | Sakshi

క్లీన్ స్వీప్ చేస్తాం

Published on Tue, 07/26/2016 - 00:36

మిగిలిన మూడు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తాం... తొలి టెస్టు తర్వాత కోహ్లి ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట ఇది.
తొలి టెస్టులో భారత్ ఆటతీరు చూస్తే ఇది అసాధ్యమేం కాదు. ఉపఖండం బయట అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించిన కోహ్లి సేన...
ఇదే జోరు కొనసాగిస్తే వెస్టిండీస్‌లో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. 17 టెస్టుల సుదీర్ఘ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో లభించిన ఈ భారీ విజయం శుభసంకేతం.

 
సీజన్‌ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు   
వెస్టిండీస్‌పై తొలి టెస్టులో భారీ విజయం  
ఫలించిన కెప్టెన్, కోచ్ వ్యూహాలు

సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్ల క్రితం జమైకాలో భారత జట్టు వెస్టిండీస్‌లో టెస్టు విజయం సాధించింది. ఆ తర్వాతినుంచి తాజాగా ఆంటిగ్వా టెస్టు వరకు ఉపఖండం బయట మన జట్టు 24 మ్యాచ్‌లు ఆడితే 15 టెస్టుల్లో ఓటమిపాలైంది. కోహ్లి సేన గెలిచిన తొలి టెస్టు ఈ మధ్య కాలంలో మనకు రెండో విజయం మాత్రమే. 2014లో లార్డ్స్‌లో మరో విజయం దక్కింది. ఈ గణాంకాలు చూస్తే విదేశీ గడ్డపై మనం సాధించే ఒక్క విజయం కూడా ఎంత విలువైందో అర్థమవుతుంది.

వెస్టిండీస్ గతంతో పోలిస్తే ఎంత బలహీనంగా ఉన్నా సరే... టీమిండియా ఘనతను తక్కువ చేయలేం. నాలుగు రోజుల పాటు పూర్తి ఆధిక్యం ప్రదర్శించి మ్యాచ్ గెలుచుకున్న భారత్, ప్రత్యర్థికి ప్రమాదకర సంకేతాలు పంపింది. 17 టెస్టుల సుదీర్ఘ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే భారీ విజయం లభించడం మున్ముందు జరిగే టెస్టులకు కావాల్సిన సన్నాహకంగా చెప్పవచ్చు.
 
ముందుండి నడిపిస్తూ...
విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన నాటినుంచి తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నాడు. ఐదుగురు బౌలర్లతో ఆడతానంటూ చెబుతూ వచ్చిన అతను... ఒక బ్యాట్స్‌మన్ తగ్గడం వల్ల తాను అదనపు బాధ్యత తీసుకుంటానన్నట్లు సందేశానిచ్చాడు. ఈ టెస్టులోనూ డబుల్ సెంచరీతో చెలరేగి తను దానిని చేసి చూపించాడు. ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైనా... విరాట్ బ్యాటింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. రాహుల్ బాగా ఆడుతున్నా ధావన్‌ను నమ్మి తుది జట్టులో చోటివ్వడం ఆశ్చర్యపరిచే నిర్ణయం. అయితే ధావన్ చక్కటి బ్యాటింగ్‌తో కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టాడు. మిశ్రా, సాహా బ్యాటింగ్ కూడా జట్టుకు కలిసొచ్చింది.
 
పేస్, స్పిన్ సమష్టిగా...
ఆంటిగ్వా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు ఎనిమిది, స్పిన్నర్లు రెండు వికెట్లు పడగొడితే... రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఎనిమిది, పేసర్లు రెండు వికెట్లు తీశారు. షమీ, ఉమేశ్‌లకు తోడు అశ్విన్, మిశ్రా చెలరేగగా... వికెట్లు తీయకపోయినా ఇషాంత్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. మొత్తంగా ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు కూడా తమదైన పాత్ర పోషించడం కోహ్లిని చాలా సంతోష పెట్టింది.

‘నా దృష్టిలో ఈ మ్యాచ్ సరిగ్గా మేం ఆశించిన రీతిలో సాగింది. విదేశాల్లో తొలి ఇన్నింగ్స్‌లో మన పేసర్లు రాణించడం సహజం, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు ఆ బాధ్యత తీసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడం, రెండు రోజుల్లో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయడం మా వ్యూహాలకు సరిగ్గా సరిపోయింది’ అని కెప్టెన్ ఆనందం వ్యక్తం చేశాడు. విదేశాల్లో కూడా మన ఆధిపత్యం ప్రదర్శించే సమయం ఆసన్నమైందని  ప్రకటించాడు.
 
అంతా అశ్విన్
ఈ మ్యాచ్‌ను ‘అశ్విన్ టెస్టు’గా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. పూర్తి స్థాయిలో, నమ్మదగిన ఆల్‌రౌండర్‌గా అతను కనిపించాడు. 33 టెస్టులకే క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథంతో పోలికలు తెచ్చే గణాంకాలు అతను నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయకపోయినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను సత్తా చూపించాడు. 22 ఓవర్ల పాటు చంద్రిక, శామ్యూల్స్ జోడి నిలబడినప్పుడు చక్కటి బంతితో ఈ జోడీని విడదీసిన అతను, చివర్లో 24.1 ఓవర్ల పాటు ఇబ్బంది పెట్టిన తొమ్మిదో వికెట్ జంటను పడగొట్టి మ్యాచ్‌ను భారత్‌కు అందించాడు.

ఇక అశ్విన్‌ను ఈ సిరీస్‌లో సమర్థంగా ఎదుర్కోవడం విండీస్ వల్ల అవుతుందా అనేది సందేహమే. గతంలో టెస్టుల్లో రెండు సెంచరీలు చేసినా... అశ్విన్ బ్యాటింగ్‌పై ఎవరికీ పెద్దగా ఆశల్లేవు. కానీ కీపర్ సాహాకంటే ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన అతను తన బ్యాటింగ్ విలువను సాధికారికంగా ప్రదర్శించాడు. స్టాన్స్ మార్చుకోవడంతో పాటు ఆఫ్‌స్టంప్‌పై పడే బంతులను ఆడటంపై పట్టు సాధించాడు. ఇది ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు కోహ్లికి కావాల్సిన ధైర్యాన్నిచ్చింది.
 
తొలి టెస్టు సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 556/8 డిక్లేర్డ్ (కోహ్లి 200, అశ్విన్ 113)
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 243 (క్రెయిగ్ బ్రాత్‌వైట్ 74, డౌరిచ్ 57 నాటౌట్, ఉమేశ్ 4/41, షమీ 4/66)
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 231 (కార్లోస్ బ్రాత్‌వైట్ 51 నాటౌట్, శామ్యూల్స్ 50, అశ్విన్ 7/83).
 
1     
ఉపఖండం బయట భారత్‌కు ఇదే (ఇన్నింగ్స్, 92 పరుగులు) అతి పెద్ద విజయం. వెస్టిండీస్ గడ్డపై భారత్ తొలి సారి ఇన్నింగ్స్ విజయం సాధించింది.

1     
విండీస్ గడ్డపై భారత్ తరఫున అశ్విన్ (7/83)దే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.

3    
ఒకే టెస్టులో సెంచరీ చేసి 7 వికెట్లు తీసిన మూడో ఆటగాడు అశ్విన్ (గతంలో జాక్ గ్రెగరీ, బోథమ్).

 
17
అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి. కేవలం 33 టెస్టుల్లోనే అతను ఈ ఘనత సాధించాడు. కెరీర్‌లో 33 టెస్టులు ఆడే సమయానికి స్పిన్నర్లలో ఇదే బెస్ట్ కాగా... ఓవరాల్‌గా వఖార్ యూనిస్ (19 సార్లు) తర్వాత అశ్విన్ రెండో స్థానంలో ఉండటం విశేషం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)