amp pages | Sakshi

అశ్విన్ ఖాతాలో మరో రికార్డు

Published on Fri, 02/24/2017 - 15:21

పుణె:ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ద్వారా అత్యంత వేగంగా 250 వికెట్లను సాధించిన రికార్డును సొంతం చేసుకున్న భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో తొలి రెండు వికెట్లను అశ్విన్ తీశాడు. దాంతో 2016-17 స్వదేశీ సీజన్లో అశ్విన్ ఖాతాలో 64వికెట్లు చేరాయి.  తద్వారా ఒక స్వదేశీ సీజన్ లో వేగంగా అత్యధిక వికెట్లను తీసిన ఘనత సాధించాడు. దాంతో కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును అశ్విన్ సవరించాడు.

 

1979-80 హోం సీజన్లో కపిల్ దేవ్ 13 టెస్టుల్లో 63 వికెట్ల తీయగా.. 2016-17 స్వదేశీ సీజన్లో అశ్విన్ ఆ రికార్డును అధిగమించాడు. 10 టెస్టుల్లో 64 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డును చెరిపేశాడు.  ఈ రోజు  ఆసీస్ రెండో ఇన్నింగ్స్  లో భాగంగా డేవిడ్ వార్నర్, షాన్ మార్ష్ లను పెవిలియన్ కు పంపడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు.


గతంలో ఈ రికార్డుకు అశ్విన్ దగ్గరగా వచ్చినప్పటికీ దాన్ని అధిగమించలేకపోయాడు.2012-13 స్వదేశీ సీజన్ లో అశ్విన్ 10 టెస్టుల్లో 61 వికెట్లు మాత్రమే తీసి ఆ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. అయితే దాదాపు మూడు సీజన్ల తరువాత ఆ రికార్డును అశ్వినే బద్దలు కొట్టడం ఇక్కడ విశేషం.

Videos

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌