amp pages | Sakshi

ఓవర్ లో 30 పరుగులు!

Published on Tue, 08/15/2017 - 15:58

లండన్:శ్రీలంకతో జరిగిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 86 బంతుల్లో శతకం నమోదు చేసి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్ లో 26 పరుగుల్ని సాధించి అభిమానులకు పండుగ చేశాడు హార్దిక్. తొలి రెండు బంతుల్ని ఫోర్లుగా కొట్టిన హార్దిక్.. ఆపై మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు.

 

ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ లో జరుగుతున్న నాట్వెస్ట్ ట్వంటీ 20 బ్లాస్ట్లో మరో మెరుపు సెంచరీ నమోదైంది. సర్రే తరపున ఆడుతున్న ఆసీస్ ఆటగాడు అరోన్ ఫించ్ చెలరేగి ఆడాడు.  ఆదివాకం ససెక్స్ తో ఓవల్ లో జరిగిన మ్యాచ్ లో ఫించ్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో  7 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 114 పరుగులు చేశాడు. అయితే సర్రే ఆడిన ఇన్నింగ్స్ 18 ఓవర్ లో ఫించ్ విరుచుకుపడ్డాడు. తొలి బంతికి రెండు పరుగులు సాధించిన ఫించ్.. ఆపై వరుసగా నాలుగు సిక్సర్లు కొట్ట్టాడు. ఒక సిక్సర్ ను మిడ్ వికెట్ మీదుగా మలచగా, ఆపై మరో రెండు సిక్సర్లను లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ దాటించాడు. మరొక సిక్సర్ ని కవ్-కార్నర్ వైపు కొట్టాడు. ఇక చివరి బంతిని సైతం సిక్స్ కొట్టే ప్రయత్నం చేసినా ఫోర్ తో నే సరిపెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో సర్రే 17 పరుగులతో విజయ సాధించింది.