amp pages | Sakshi

లతా రజనీకాంత్‌ రుణం చెల్లించాల్సిందే

Published on Tue, 04/17/2018 - 07:25

సాక్షి సినిమా:కొచ్చాడయాన్‌ చిత్రం కోసం తీసుకున్న రుణాన్ని జూలై 3వతేదీ లోగా లతా రజనీకాంత్‌ చెల్లించాల్సిందేనని చెన్నై హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ఈ కేసు విషయమై ఇంతకు ముందే హైకోర్టు కొచ్చాడయాన్‌ చిత్రం కోసం బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి లతా రజనీకాంత్, ఆమెకు సంబంధిత మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ రుణం రూ.6.20 కోట్లలను చెల్లించాలని గత ఫిబ్రవరిలో  ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. అందులో ఈ కేసుకు లతారజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, కొచ్చాడయాన్‌ చిత్రానికి సంబంధించిన ఈ కేసులో యాడ్‌బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన రూ.10 కోట్లలో ఇప్పటికే రూ.9.20కోట్లు తిరిగి చెల్లించినట్లు, మిగిలిన రూ.80 లక్షలను త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు.

పిటిషన్‌ కొట్టివేత..
పిటిషన్‌ను సోమవారం విచారణకు రాగా హైకోర్టు మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఆదేశించినట్లుగా జూలై నెల 3లోగా లతారజనీకాంత్‌ గాని, మీడియా ఒన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ గాని యాడ్‌ బ్యూరో సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌