amp pages | Sakshi

అమెరికాలో తలైవా

Published on Sat, 04/28/2018 - 07:10

తమిళసినిమా: నటుడు రజనీకాంత్‌ అమెరికా చుట్టేస్తున్నారు. ఆయన అక్కడ జాలీగా షాపింగ్‌ చేస్తున్న ఫొటోలు, రైల్లో పయనిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడిమాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. రజనీకాంత్‌ ప్రతి ఏడాది అమెరికాకు వెళ్లి అక్కడ ఆరోగ్యానికి సంబంధించిన జనరల్‌ చెకప్‌ చేయించుకుని, పనిలో పనిగా తన గురువు సచ్చితానంద ఆశ్రమానికి వెళ్లి ధ్యానం చేస్తారు, అలా వారం లేక 10 రోజులు గడిపి చెన్నైకి తిరిగిరావడం ఆనవాయితీ. అదే విధంగా 2.ఓ, కాలా చిత్రాలను పూర్తి చేసిన ఈ సూపర్‌స్టార్‌ మరో కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. మరో పక్క రాజకీయ పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌ గత 23వ తేదీన జనరల్‌ వైద్యపరిశోధన కోసం అమెరికా వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన అమెరికాలో రైలు ప్రయాణం చేస్తున్న ఫొటో, షాపింగ్‌ చేస్తూ ఎస్కిలేటర్‌పై స్టైల్‌గా నిలబడిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆయన నీట్‌గా జుత్తు కట్‌ చేసుకుని, తలకు రంగు వేసుకుని, తెల్లని గడ్డం, మీసాలతో చాలా స్టైల్‌గా, యూత్‌ఫుల్‌గా పుల్‌ జోష్‌గా కనిపిస్తున్న ఆ ఫొటోలను చూసిన అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. రజనీకాంత్‌ మరో నాలుగు రోజుల పాటు అమెరికాలోనే ఉండి చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటించనున్న  తాజా చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో లీనం అవుతారని సమాచారం. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌