amp pages | Sakshi

భార్యను ఎలా కొట్టాలంటే..!

Published on Fri, 04/19/2019 - 10:11

దోహా : నేటికి కూడా స్త్రీని ఓ అంగడి సరుకుగా భావించే సమాజం ఇది. దేశాలు, ప్రాంతాలు మారినప్పటికి ఈ భావజాలం మాత్రం మారదు. అందులోనూ జీవితాంతం తనకు తోడుగా ఉండటానికి వచ్చిన స్త్రీ పట్ల మరింత చులకన భావం కనిపిస్తుంటుంది చాలా మంది మగాళ్లలో. బయట చాలా విషయాల్లో కనీసం నోరేత్తని ఆజానుబాహులు కూడా భార్యల దగ్గరకు వచ్చే సరికి ప్రతి చిన్న విషయానికి కూడా చేయ్యెత్తడానికి రెడీగా ఉంటారు. ఈ ఆధునిక కాలంలో కూడా భార్యంటే కుక్కిన పేనులా పడుంటుందనే ధైర్యంతో పురుషులు రెచ్చిపోతుంటే.. భర్త వదిలేస్తే తన జీవితమే నాశనమవుతుందనే భయంతో మహిళలు బతుకీడుస్తున్న సంఘటనలు కోకొల్లలు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే మళ్లీ ఓ వందేళ్లు వెనక్కి ప్రయాణించాం అనిపించకమానదు. ఇప్పటికి కొన్ని ముస్లిం దేశాల్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. నేటికీ మహిళకు వారిచ్చే విలువ ఏంటో ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఖతర్‌కు చెందిన సోషియాలజిస్ట్‌ ఒకరు భార్యను ఎలా కొట్టాలో వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. దారుణం ఏంటంటే భార్యను కొట్టడమే తప్పంటే..  దానికి మతం కూడా అనుమతించిందంటూ కొన్ని తలకు మాసిన నియమాలు చెప్పుకొచ్చాడీ సోషియాలజిస్ట్‌.

వివరాలు.. ‘పెళ్లైన మగవారు ఈ వీడియోను తప్పక చూడాలి. భార్యను కొట్టడం తప్పనిసరి.. కానీ ప్రతిరోజు కాదు. ఈ కొట్టడం కూడా ఎలా ఉండాలంటే భార్యకు తాను ఆడదాన్ని అని.. భర్త మగవాడు, బలవంతుడు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా కొట్టాలి. భార్యకు తన భర్త శక్తిసామర్థ్యాలు తెలిసేలా దండించాలి. ముందు మీరొక విషయం అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని ఓ కంపెనీగా భావిస్తే.. భర్త దాని యజమాని. భార్య అందులో వర్కర్‌. వర్కర్‌ బుద్ధిగా మసులు కోవడం కోసం యజమాని వారిని దండించాలి. అలా అయితేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమగా ఉండటం వల్ల క్రమశిక్షణ అలవడద’ని సదరు సోషియాలజిస్టు ఈ వీడియోలో పేర్కొన్నాడు.

అంతేకాక ‘భార్య పద్దతిగా నడుచుకోవాలంటే భర్త తన ప్రేమను పక్కకు పెట్టి భార్యను కొట్టాలి. భార్య క్రమశిక్షణతో మసలకపోతే.. ముందు హెచ్చరించాలి.. తరువాత సలహా ఇవ్వాలి.. అప్పటికి దారికి రాకపోతే పడక గదికి దూరంగా ఉంచాలి. ఆఖరి ప్రయత్నంగా మాత్రమే ఆమెను దండించాలి. అయితే ఆమెను లాగిపెట్టి ముఖం మీద కొట్టడం, ముక్కు మీద గుద్దడం.. తల మీద బాదడం లాంటివి చేయకూడదు. రక్తం వచ్చేలా కూడా కొట్టకూడదు’ అని చెప్పడమే కాక ఎలా కొట్టాలో ఓ డెమో కూడా చేసి చూపించాడు సదరు సోషియాలజిస్ట్‌.

ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే.. పదేళ్ల పిల్లాడి మీద ఈ డెమో చేసి చూపించడం. అంటే ఇప్పటి నుంచే ఆ చిన్న బుర్రలోకి మహిళ అంటేనే ఓ సరుకు అని.. దాని మీద మగవాడికి పూర్తి హక్కు ఉందనే పాఠాన్ని బలంగా ఎక్కిచ్చేస్తున్నాడీ ప్రబుద్ధుడు.

Videos

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)