amp pages | Sakshi

ఆంధ్రజ్యోతి పేరు మారిస్తే బాగుంటుందేమో..

Published on Tue, 04/09/2019 - 18:03

సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ‍్వజమెత్తారు. మంగళవారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన ... జయదేవ్‌ మీద భూకబ్జా కేసులున్నాయని ఆరోపించారు. ఓట్లు గుంటూరువి.. నోట్లు మాత్రం చిత్తూరుకా అని మండిపడ్డారు. ఇక మంగళగిరి అని స్పష్టంగా పలకలేని నారా లోకేష్‌.. మంగళగిరి టీడీపీ అభ్యర్థా అని ప్రశ్నించారు. చంద్రబాబు మీడియా సాక్షిగా ఎన్టీఆర్‌ను వాడు అన్నాడంటే.. రూమ్‌లో ఇంకేం మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చని మోదుగుల అన్నారు.

ఆంధ్రజ్యోతి దినపత్రికకు  జ్యోతి లక్ష్మీగా పేరు మారిస్తే బాగుంటుందని మోదుగుల ఎద్దేవా చేశారు. రాధాకృష్ణ.. జ్యోతి లక్ష్మీ భంగిమలా ఎన్ని మాటలైన మాట్లాడతాడని ఆయన మండిపడ్డారు. టీడీపీకి చంద్రబాబు, లోకేష్‌లు నాయకులుగా పనికిరారన్నారు. మీ పార్టీకి నాయకులను మార్చుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు అభివృద్ధి కోసం ఏమేమి పనులు చేపట్టాలో తెలిపేలా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని మోదుగుల తెలిపారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)