amp pages | Sakshi

మా కష్టాన్ని టీడీపీ నేతలు దోచుకున్నారన్నా..

Published on Fri, 02/23/2018 - 02:31

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
చెరువులో తాము కష్టపడి పెంచిన చేపలను అధికారం అండ చూసుకుని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పట్టుకెళ్లారని ప్రకాశం జిల్లా పీసీ పల్లి, కనిగిరి మండలాలకు చెందిన జాలర్లు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం శ్రుతిమించిపోయిందని, అది తమ కడుపుకొట్టే దాకా వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం 95వ రోజు వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి, కనిగిరి మండలాల్లో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగించారు.

ఈ సందర్భంగా పామూరు మండలం మోపా డు, పామూరు, నుచ్చుపొద గ్రామాలకు చెందిన యానాది కుటుంబాల్లోని మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి వచ్చి జగన్‌ను కలిశారు. నుచ్చుపొద జాలర్ల సహకార సంఘం పరిధిలోని ఎనిమిది చెరువుల్లో సభ్యులు పెంచుకున్న కోట్లాది రూపాయల విలువైన చేపలను స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు పట్టుకొని అమ్ముకున్నారని వాపోయారు.

జాలర్ల సం ఘంలో సభ్యులుగా ఉన్న తమ ఇళ్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి.. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మోపాడు (రిజర్వాయర్‌) చెరువులో గత ఆగస్టులో రూ.కోటిన్నర విలువైన చేపలను పట్టుకుపోయారని వివరించారు. తమ సంఘం పరిధిలో ఉండే మరో ఏడు చెరువుల్లో ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే చేపలు ఉన్నాయని, టీడీపీ నేతలు వాటిని కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యం, అక్రమాలపై బహిరంగ విచారణ జరిపించాలని వారు కోరారు.

బాధితుల గోడు సావధానంగా విన్న జగన్‌.. జాలర్ల కుటుంబా లకు తమ పార్టీ  ఎప్పుడూ అండగా ఉంటుంద ని హామీ ఇచ్చారు. పీసీ పల్లి మండలం రామాపురం వద్ద గొర్రెల కాపరులు జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గతంలో గొర్రెల కాపరులకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదని.. ఈ ప్రభుత్వంలో గొర్రెలకు బీమా సౌకర్యాన్ని అమలు చేయడం లేదని వారు జగన్‌కు వివరించారు.  అందరి కష్టాలు ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌