amp pages | Sakshi

కేటీఆర్‌ కుదరదంటే.. కాంగ్రెస్‌తో జతకట్టలేదా : వైఎస్‌ జగన్‌

Published on Mon, 12/03/2018 - 18:15

సాక్షి, రాజాం (విజయనగరం) : తెలంగాణ ఎన్నికల్లో పొత్తుకు టీఆర్‌ఎస్‌ అంగీకరించకపోవడంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో జతకట్టలేదా? అని ప్రతిపక్షనేత, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం బహిరంగా సభలో మాట్లాడుతూ..‘రాష్ట్ర పాలన గాలికొదిలి ఎవరో ప్రధాని అంటా వారిని అధికారం నుంచి దింపడానికి చంద్రబాబు తిరుగుతున్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేస్తారు. అప్పుడు నరేంద్రమోదీ వంటి నాయుకుడు లేడని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. బీజేపీ మన రాష్ట్రానికి చేసినట్లుగా ఏ రాష్ట్రానికి చేయలేదన్నారు. నాలుగేళ్లపాటు ఇద్దరు చిలకా గోరింకల్లా ఉంటారు. వీరిని చూసి అవి కూడా సిగ్గుపడేలా సంసారం చేశారు. ఇక్కడ అన్ని విధాలుగా మోసం చేశారని ప్రజలు అనుకుంటుండటంతో ఎవరి మీద నెట్టెయ్యాలని భావించి బీజేపీకి విడాకులు ఇచ్చారు.

నాడు గాడ్సే.. నేడు దేవత
2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ..  విడగొట్టిన సోనియా గాంధీ అవినీతి అనకొండ.. ఈనాడు.. అందాల కొండ. నాడు గాడ్సే.. ఈ రోజు దేవత. ఆరోజు రాహుల్‌ గాంధీ వంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పాలిస్తాడా? అని అడిగారు. ఇ‍ప్పుడు ఏమో మేధావి అంటున్నారు. వీరి రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయి. ఇదే కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు అవినీతిపాలనపై రాహుల్‌ గాంధీ ఫొటోతో చార్జ్‌ షీట్‌ అనే పేరుతో బుక్‌ రిలీజ్‌ చేసింది. ఈ రోజు సిగ్గులేకుండా తెలంగాణ ఎన్నికల్లో జతకట్టింది. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా చంద్రబాబు.. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌తో టీడీపీ-టీఆర్‌ఎస్‌ను కలిసి పోటీ చేస్తే బాగుంటుందని అడిగారు. దీనికి కేటీఆర్‌ మనమిద్దరం కలిసి ఉండడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేటీఆరే మీడియాకు తెలిపారు. చంద్రబాబు వెంటనే కాంగ్రెస్‌తో డీల్‌ కుదుర్చుకున్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ము ఇస్తాననగానే కాంగ్రెస్‌ వాళ్లు ఒకే అన్నారు. అక్టోబర్‌లో డీల్‌.. నవంబర్‌లో సీట్లు పంచుకున్నారు. కేటీఆర్‌ అప్పుడు డీల్‌ ఒప్పుకుంటే.. కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోసేవాడివి కాదా? అని చంద్రబాబును అడుగుతున్నా. దీనికి పైగా  చక్రం తిప్పడమని కితాబిచ్చుకుంటున్నారు. నీ చావు తెలివి తేటలు నాలుగున్నరేళ్లుగా చూస్తున్నాం

డైరెక్టర్‌ చంద్రబాబు.. యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌
నాలుగున్నరేళ్లు చంద్రబాబుతో కాపురం చేసిన పవన్‌ కల్యాణ్‌.. బాబు చెప్పిన ప్రతీ అబద్ధం.. మోసం.. అవినీతిలో భాగస్వామి కాదా? చంద్రబాబు పేమెంట్‌ ఇవ్వగానే పవన్‌ కల్యాణ్‌ కాల్షీట్లు ఇస్తారు. డైరెక్టర్‌ చంద్రబాబు.. యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌.. నిర్మాత లింగమనేని. పవన్ ఓ నిత్య పెళ్ళికొడుకు.. నాలుగేళ్లకు ఒకసారి కొత్త కారు మార్చినట్లు పెళ్లాలను మార్చుతారు. భారతదేశంలో వివాహ వ్యవస్థ పవిత్రమైంది. రేణుదేశాయి పవన్ కళ్యాణ్ తీరును ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే పవన్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసారు. దాన్ని పవన్ కల్యాణ్ ఖండించలేదు. పవన్ కళ్యాణ్ తప్పును ఎత్తి చూపిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లపై  ఇష్టానుసారంగా మాట్లాడిపిస్తారు.’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)