amp pages | Sakshi

అవినీతిలో ఏపీ నంబర్‌ 1

Published on Tue, 12/12/2017 - 03:49

పలమనేరు: రాష్ట్రాన్ని అభివృద్దిలో కాకుండా అవినీతిలో నంబర్‌ 1 చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రోజా మాటాడారు. ఇక్కడ నారా లోకేశ్‌ దండుకున్న అవినీతి సొమ్మును దాచేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అమరనాథరెడ్డి ఇటీవల కొరియాకు వెళ్లారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిలో మన రాష్ట్రం స్థాయి దారుణంగా దిగజారిందన్నారు.

దేశంలోనే అత్యధిక హెచ్‌ఐవీ కేసుల్లో, మహిళల అక్రమ రవాణాల్లో, అప్పుల్లో రాష్ట్రాన్ని నంబర్‌ 1 చేశారని పత్రికలే చెబుతున్నాయని గుర్తుచేశారు. ఉంగరం, వాచీ కూడా లేదంటూనే దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించి మంత్రి అయిన అమరనాథరెడ్డి టీవీల్లో మీసాలు తిప్పడం కాదు సొంత జిల్లాలో ఓ పరిశ్రమనైనా నెలకొల్పారా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలకు బాధలు తప్పడం లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రాజకీయాల్లోకి రాకముందు మిద్దె లేని చంద్రబాబు ఇన్ని రూ.వేల కోట్లను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్, పార్టీ నేత జె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌